Sangam Dairy Case: సంగం డెయిరీలో చల్లారని మంటలు.. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సహా మరికొందరిపై కేసులు..

సంగం డెయిరీలో కేసుల గొడవ కలకలం రేపింది. బోనస్‌ ఫైట్‌.. కేసుల దాకా వెళ్లింది. సంగం డెయిరీ చైర్మన్‌, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు నమోదయింది. పాల విక్రయాలకు సంబంధించి తాను బోనస్‌ అడిగితే.. డెయిరీ దగ్గరకు పిలిచి తనపై దాడి చేశారంటూ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంకు చెందిన ముసునూరి రాము ఫిర్యాదు చేశాడు.

Sangam Dairy Case: సంగం డెయిరీలో చల్లారని మంటలు.. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సహా మరికొందరిపై కేసులు..
Sangam Dairy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 20, 2023 | 7:57 AM

సంగం డెయిరీలో కేసుల గొడవ కలకలం రేపింది. బోనస్‌ ఫైట్‌.. కేసుల దాకా వెళ్లింది. సంగం డెయిరీ చైర్మన్‌, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు నమోదయింది. పాల విక్రయాలకు సంబంధించి తాను బోనస్‌ అడిగితే.. డెయిరీ దగ్గరకు పిలిచి తనపై దాడి చేశారంటూ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంకు చెందిన ముసునూరి రాము ఫిర్యాదు చేశాడు. ఈనెల 15న సంగం డెయిరీ వద్ద కర్రలు, హాకీ స్టిక్‌లతో తమపై దాడి చేశారని, ఈ దాడిలో తమవి మూడు కార్లు ధ్వంసం అయ్యాయని రాము ఫిర్యాదులో తెలిపాడు. పాల విక్రయానకి సంబంధించి తనకు బోనస్ 14 శాతం ఇవ్వలేదని రాము చెబుతున్నాడు. రాము ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14 వ నిందితునిగా ఎఫ్ఐఆర్‌లో నమోదుచేశారు. ధూళిపాళ్ల నరేంద్రతో పాటు పలువురిపై సెక్షన్‌ 307 కింద కేసు నమోదు అయింది. ఇదే కేసుకు సంబంధించి సంగం డెయిరీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై అభ్యంతరం తెలిపారు సంగం డెయిరీ డైరెక్టర్లు . ఇదంతా రాజకీయ కక్ష అంటున్నారు. కొద్ది రోజులుగా సంగం డెయిరీపై విష ప్రచారం జరుగుతోందంటూ వాళ్లు ఆరోపించారు. పాల ఉత్పత్తి దారులకు సంగం డెయిరీ ఒక్క పైసా కూడా ఎగ్గొట్టలేదన్నారు వాళ్లు. ఫిర్యాదు చేసిన రాముకు అన్ని బకాయిలు చెల్లించామంటున్నారు డైరెక్టర్లు. గొడవ సంగం డైరీలో జరగలేదు.. డైయిరీ బయట కవాలని కొందరు కుట్రతో సృష్టించారని తెలిపారు. ఈఘటన వెనుక స్థానిక ఎమ్మెల్యే కిలారు రోశయ్య హస్తం ఉందంటూ సంగం డెయిరీ డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు.

గతంలో లాబాలు బాగా ఉన్నప్పుడు 10శాతం బోనస్ ఇచ్చేవారిమని.. ఇప్పుడు లీటర్ పాలకు రైతుకు రూ.80 చెల్లించడంతో బోనస్‌లు తగ్గాయని చెప్పారు. దీంతో నాలుగు శాతం మాత్రమే బోనస్ ఇచ్చినట్లు తెలిపారు. సంగం డెయిరీ మీద అపవాదులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏసీబీతో దాడులు చేయించి సంగం డెయిరీ ని ఆక్రమించాలని ప్రభుత్వం చూసిందన్నారు. ఇలాంటి వన్నింటిని న్యాయపరంగా ఎదుర్కుంటామని చెప్పారు సంగం డైయిరీ డైరెక్టర్లు, బోర్డు మెంబర్లు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..