Karthika Masam: నేడు కార్తీక మాసం మొదటి సోమవారం.. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
కార్తీక మాసం మొదటి సోమవారం రోజు గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు గోదావరిలో దీపాలను వదులుతున్నారు. సూర్యోదయానికి సుమారు గంట ముందు చేసే తీర్థ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కూడా. సనాతన హిందూ మతం ప్రకారం స్నానానికి గొప్ప స్థానం ఉంది. నదీ స్నానం ఆచరించి పుణ్యక్షేత్రాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. కఠిన నిష్టతో

రాజమండ్రి, నవంబర్ 20: కార్తీక మాసం మొదటి సోమవారం రోజు గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు గోదావరిలో దీపాలను వదులుతున్నారు. సూర్యోదయానికి సుమారు గంట ముందు చేసే తీర్థ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కూడా. సనాతన హిందూ మతం ప్రకారం స్నానానికి గొప్ప స్థానం ఉంది. నదీ స్నానం ఆచరించి పుణ్యక్షేత్రాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. కఠిన నిష్టతో నోములు, వ్రతాలు నోటి.. గోదావరి స్నానం ఆచరించి గోదావరిలో దీపాలు వదిలితే సకల పాపాలు తొలగుతాయనేది నానుడి.
ఆధ్యాత్మిక నగరం రాజమండ్రి పుష్కర్ ఘాటుతో పాటు కోటిలింగాల ఘాట్‌కు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి గోదావరి స్నానం ఆచరించి గోదారమ్మ తల్లికి పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వదిలారు. కార్తీకమాసంను పురస్కాదించుకుని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి ఆధ్యాత్మిక నగరం దక్షిణ కాశీగా పిలవబడే రాజమండ్రిలో కార్తీకమాసం రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో స్థానిక ఎంపీ భరత్ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రిలో ఉన్న గోదావరి ఘాట్లను ఎంపి భరత్ సందర్శించారు. గోదావరి తీరాన్ని నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ అన్నారు.




మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.