Karthika Masam: కార్తీక సోమవారం వేళ.. శివనామస్మరణలతో మార్మోగుతున్న శివాలయాలు..
ఇందులో భాగంగానే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్త జనం.. గంగాధర మండపం,ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు. క్యూలెన్‌లో వేలాది మంది భక్తులు ఉండడంతో దర్శనానికి 8 గంటల సమయం...

కార్తీక మొదటి సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాలకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తెల్లవారు జామునే స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో శివాలయాలను సందర్శిస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్త జనం.. గంగాధర మండపం,ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు. క్యూలెన్‌లో వేలాది మంది భక్తులు ఉండడంతో దర్శనానికి 8 గంటల సమయం పట్టే అవకాశాలున్నాయని ఆలయ సిబ్బంది చెబుతోంది.
కోనసీమలో భక్తుల కిటకిట..
కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమలో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. పుష్కరిణిలో స్నానమాచరించి భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఇక అంబాజీపేట మాచవరం శివలయనికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చి భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. పూజారులు పంచామృతలతో అభిషేకాలు నిర్వహించారు.
రాజమహేంద్రవరంలో కార్తీక శోభ..
కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ కు గోదావరి స్నానాలకు భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారు జాము నుంచి స్నానమాచరించి గోదావరిలో దీపాలు వదలడానికి భారీ ఎత్తున మహిళలు పొటెత్తారు. అలాగే పాదగయ పుష్కరనీతోపాటు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం సామర్లకోట కుక్కుటేశ్వర స్వామి ఆలయల్లో కార్తీకదీపాలు వెలిగించి భక్తులు పూజలు నిర్వహించారు.
ఇక శ్రీ రాజరాజేశ్వరీ సమేత కుక్కుటేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలకొల్లులో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామ లింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారు జాము నుంచే స్వామి వారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు, భక్తులు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు.
నరసాపురంలో కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని వశిష్ఠ గోదావరి నదీ తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు తెల్లవారు జాము నుంచే పుణ్య నదీ స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. భీమవరంలోని పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామున నుంచి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..