Watch Video: నదీ తీరంలో అబ్బుర పరుస్తున్న నూతన సంవత్సర సైకత శిల్పం..
నూతన సంవత్సర వేడుకులు ప్రపంచ వ్యాప్తoగా ఘనంగా జరిగాయి. గడిచిన 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 కి అంతా ఘనంగా స్వాగతం పలికారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్‌లలో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి ఎంతో హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత సంవత్సరంలో ఎదురైన బాధలను విడిచి కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం లోకి అంతా అడుగు పెట్టారు.

నూతన సంవత్సర వేడుకులు ప్రపంచ వ్యాప్తoగా ఘనంగా జరిగాయి. గడిచిన 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 కి అంతా ఘనంగా స్వాగతం పలికారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్‌లలో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి ఎంతో హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత సంవత్సరంలో ఎదురైన బాధలను విడిచి కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం లోకి అంతా అడుగు పెట్టారు. మందు, విందు పార్టీలతో.. బాణాసంచా కాల్చి ఎవరు స్థాయిని బట్టి వారు వేడుక చేసుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ నేపధ్యంలోనే తాను సైతం అంటూ శ్రీకాకుళం జిల్లాకి చెందిన తరణి ప్రసాద్ మిశ్రా అనే ఓ సైకత శిల్పి తన కుంచుకు పని చెప్పాడు. ప్రముఖ వంశధార నదీ తీరంలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.
వివిధ సందేశాలతో అందమైన ఇసుక శిల్పాలను రూపొందించటం ఒక అద్భుతమైన కళ. శ్రీకాకుళం జిల్లా LN పేటకు చెందిన తరణి ప్రసాద్ మిశ్రా అనే సైకత శిల్పి నూతన సంవత్సరం, పండుగలు, ప్రత్యేక పర్వదినాలు వంటి సందర్భాలలో తన సృజనాత్మకతను చాటుతూ ప్రజలకు అవగాహనను, సందేశాన్ని కల్పిస్తూ స్థానిక వంశధార నదీ తీరంలో సైకత శిల్పాలను రూపొందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తన కళా నైపుణ్యతతో 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వంశధార నదిలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఇసుకతో ఆయన రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సైకత శిల్పం వంశధార నదికి అందాన్ని, చూసే పర్యాటకులకు సందేశాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తోంది. తరణి ప్రసాద్ మిశ్రా గతంలో 2018,2021 ఏడాదులకు గానూ స్వాగతం పలుకుతూ సైకత శిల్పాలు రూపొందించారు. జగన్నాధుడు, శివుడు, పవన్ కల్యాణ్‌ల సైకత శిల్పాలను గతంలో రూపొందించాడు తరణి ప్రసాద్ మిశ్రా.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
