Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్‌గిర్ జిల్లాలోని ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రంగా గాయపడ్డారు.

Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు మృతి
Accident
Follow us
Aravind B

|

Updated on: Jun 06, 2023 | 12:37 PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్‌గిర్ జిల్లాలోని ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లంతా కలబురిగిలోని దర్గా ఉరుసు జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మునీర్‌ (40), నయామత్‌ (40), రమీజా బేగం (50), ముద్దత్‌ షీర్‌ (12), సుమ్మి (13) గా గుర్తించారు. వీళ్లు నంద్యాల జిల్లా వెలగొడు, ఆత్మకూరుకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి వెలుగోడుకు చెందిన నాయకులను, అడ్వకెట్ ను పంపారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామి ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సొంత ఖర్చులతో ప్రమాద బాధితులు, మృతదేహల తరలింపుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం