Andhra Pradesh: ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం.. మరో యువతితో పెళ్లి.. చివరికి ఊహించని షాక్
Kurnool News: పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి. కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకుంటారు. మరికొందరు ప్రేమ పెళ్లిల్లు చేసుకుంటారు.అయితే కర్నూల్‌లో మాత్రం ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని.. పెళ్లి మరో యువతితో చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి. కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకుంటారు. మరికొందరు ప్రేమ పెళ్లిల్లు చేసుకుంటారు.అయితే కర్నూల్‌లో మాత్రం ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని.. పెళ్లి మరో యువతితో చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళ్తే కర్నూలులోని పీవీ నరసింహారావుకాలనీకి చెందిన మల్లెపోగు మధు, షేకమ్మ దంపతుల కుమార్తె పద్మావతి(30). ఈమె డిగ్రీ పూర్తయ్యాక ఓ వాహన షోరూంలో పదేళ్లుగా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోటకు చెందిన వినోద్‌కుమార్ అదే షోరూంలో చేరాడు. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
అనంతరం వినోద్ శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ పరిధిలోని కియా షోరూంలోకి ఉద్యోగం మారి తరచూ పద్మావతికి ఫోన్ చేస్తుండేవాడు. చివరికి తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకొని మార్చి 9న వారికి నిశ్చితార్థం చేశారు. రూ.లక్ష నగదు, బంగారం కట్నంగా ఇస్తామని పద్మావతి తల్లిదండ్రులు అంగీకరించారు. జూన్ 10 పెళ్లికి లగ్నపత్రిక కూడా రాయించారు.ఆ తర్వాత వినోద్ అందరికీ షాక్ ఇచ్చాడు. పద్మావతి తనకంటే వయస్సులో నాలుగేళ్లు పెద్దదని, బలవంతంగా నిశ్చితార్థం చేశారంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మే 29న వెంకాయపల్లె ఎల్లమ్మ ఆలయంలో మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో పద్మావతి తల్లిదండ్రులు దిశ మహిళా పోలీసు స్టేషన్‌లో వినోద్ పై ఫిర్యదు చేశారు. అయితే దీనికి సంబంధించిన విచారణ సోమవారం జరగాల్సి ఉండగా తెల్లవారుజామున పద్మావతి విషం తాగింది.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆరోగ్యం విషమించి చనిపోయింది. అనంతరం పోలీసులు విచారణ చేస్తుండగా వారికి ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘అమ్మా నాన్నా! నన్ను క్షమించండి. మీరు చెప్పిన మాట విననందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా గురించి బాధ పడకండి. తమ్ముడు, చెల్లి గురించి ఆలోచించండి. నా చావుకు కారణం వినోద్. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా నా వెంట తిరిగాడు. నిశ్చితార్థం చేసుకుని లగ్నపత్రిక రాయించి, పెళ్లిపత్రికలు అచ్చు వేయించాక ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతను నన్ను మోసం చేశాడు. వినోద్, అతని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బక్కన్న, బావ శోభన్, చిన్నాన్న మధుబాబు, ఐదుగురు మేనత్తలు నా చావుకు కారణం’ అని ఆ లేఖలో పేర్కొంది. దీంతో పోలీసులు వినోద్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం