RK Roja: రుషికొండ భవనాల వివాదంపై మాజీ మంత్రి రోజా ట్వీట్
తమ ప్రభుత్వ హయాంలో రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల విషయమై వైసీపీ మాజీ మంత్రి రోజా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని కూటమి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.

రుషికొండ భవనాల వివాదంపై మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. పర్యాటక స్థలంలో పర్యాటకశాఖ భవనాలు నిర్మించడం తప్పా అని ఆమె ప్రశ్నించారు. వర్షానికి లీకయ్యే అసెంబ్లీ, సచివాలయం కట్టినవాళ్లు నాణ్యతతో నిర్మించిన భవనాలు చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 2021లోనే కేంద్ర అటవీపర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి రుషికొండలో నిర్మాణాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు.
” 61 ఎకరాలకు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టాం. అందులో అక్రమం ఎక్కడుంది. ప్రతి దశలోనూ హైకోర్టుకు నివేదిక సమర్పించాం జగన్ సొంత భవనాలు అన్నట్టుగా ప్రచారం చేసేవాళ్లు..అవి ప్రభుత్వ భవనాలని ఇప్పటికైనా అంగీకరిస్తారా.. లేదా ?” అంటూ రోజా ట్వీట్ చేశారు.
సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో రుషికొండపై జగన్ కోసం ప్యాలస్ కట్టి.. ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో.. నాటి పర్యాటక శాఖ మంత్రిగా ఆ విమర్శలకు రోజా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే మాజీ మంత్రి అమర్‌నాథ్.. అధికారపక్షం తీరును తప్పుపడితే.. ఇప్పుడు రోజా రియాక్ట్ అయ్యారు. పర్యాటక స్థలంలో పర్యాటకశాఖ భవనాలు నిర్మించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇందులో ఎక్కడా అక్రమాలు లేవన్నారు రోజా.
మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
