AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు అమ్ముతూనే కోట్లలో బంగారం వ్యాపారం.. ఇంతకీ పాలుకి, పసిడికి లింకేంటి..?

చదువులేని అమాయకపు వ్యక్తి నమ్మకాన్ని పణంగా పెట్టాడు. పాలుపోసే వ్యక్తి పేరుతో ఎస్‌బీఐలో బులియన్‌ అకౌంట్‌ తెరిచాడు. అతనికి తెలియకుండా ఏకంగా కోట్లలో బంగారం బిజినెస్‌ చేశాడు. నెల్లూరు జిల్లా కందుకూరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో పాలుపోసే వ్యక్తి పేరుతో బ్యాంకు అకౌంట్ తెరిచాడు. మేనేజర్ అనుమానంతో విషయం బయటపడింది.

పాలు అమ్ముతూనే కోట్లలో బంగారం వ్యాపారం.. ఇంతకీ పాలుకి, పసిడికి లింకేంటి..?
Milk Delivery Man
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 01, 2025 | 7:29 PM

Share

చదువులేని అమాయకపు వ్యక్తి నమ్మకాన్ని పణంగా పెట్టాడు. పాలుపోసే వ్యక్తి పేరుతో ఎస్‌బీఐలో బులియన్‌ అకౌంట్‌ తెరిచాడు. అతనికి తెలియకుండా ఏకంగా కోట్లలో బంగారం బిజినెస్‌ చేశాడు. నెల్లూరు జిల్లా కందుకూరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో పాలుపోసే వ్యక్తి పేరుతో బ్యాంకు అకౌంట్ తెరిచాడు. కోట్ల రూపాయల అక్రమ బంగారం వ్యాపారం నిర్వహించిన రిటైర్డ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నత అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన డోగిపర్తి వెంకట కోట సాంబశివరావు చదువు లేని అమాయకపు వ్యక్తి గల్లా రమణయ్య పేరుతో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కందుకూరు శాఖలో నవంబర్ 21, 2024న బులియన్ అకౌంట్ తెరిచాడు. సుకన్య ట్రేడర్స్ పేరుపై ఖాతా తెరిచిన సుమారు 5 కోట్ల రూపాయల మేర బంగారం కొనుగోళ్లు నిర్వహించాడు. సుకన్య ట్రేడర్స్‌కు తన ఇంటి చిరునామా ఇచ్చిన సాంబశివరావు లావాదేవీలు నిర్వహించాడు.

కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతున్నప్పటికీ గల్లా రమణయ్య బ్యాంకుకు ఎప్పుడూ రాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ రమణయ్యను తీసుకుని రావాలని కోరాడు. తప్పని పరిస్థితులలో సాంబశివరావు, రమణయ్యను బ్యాంకు మేనేజర్ వద్దకు తీసుకుని వెళ్ళాడు. బ్యాంకు మేనేజర్ అడిగే ప్రశ్నలకు రమణయ్య సమాధానం చెప్పలేక, ఎదో తప్పు జరుగుతూ ఉందని గమనించి తన అకౌంట్ రద్దు చేయాలని చెప్పి బ్యాంకు నుండి వెళ్ళిపోయాడు. రమణయ్య శుక్రవారం (అక్టోబర్ 31) రాత్రి సాంబశివరావు ఇంటికి వెళ్లి నిలదీయడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది.

గత 40 సంవత్సరాలుగా రమణయ్య కుటుంబం సాంబశివరావుకు పాలు పోస్తుండటంతో రమణయ్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సాంబశివరావు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడ్డాడు. సాంబశివరావు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూనే జీవిత భీమా ఏజెంట్, పోస్టల్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుండేవాడు. పోలీసులకు సమాచారం అందటంతో బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదంః పవన్ కల్యాణ్
ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదంః పవన్ కల్యాణ్
సైబర్ నేరగాళ్ల 'బాస్ స్కామ్'పై సెబీ కీలక హెచ్చరిక
సైబర్ నేరగాళ్ల 'బాస్ స్కామ్'పై సెబీ కీలక హెచ్చరిక
పాలు మరిగించే సరికొత్త పద్ధతి..సోషల్ మీడియాలో వైరల్ కిచెన్ హ్యాక్
పాలు మరిగించే సరికొత్త పద్ధతి..సోషల్ మీడియాలో వైరల్ కిచెన్ హ్యాక్
బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ సంచలనం..ఇన్ఫినిక్స్ హాట్ 70
బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ సంచలనం..ఇన్ఫినిక్స్ హాట్ 70
నాన్ వెజ్ తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదు?..
నాన్ వెజ్ తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదు?..
ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది
ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!