Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AndraPradesh : పార్క్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఈ ప్రదేశం ఏంటంటే?

మనిషి జీవితంలో ఆఖరి మజిలి అంతిమ యాత్ర.. చనిపోయిన తరువాత అన్ని మతాల్లోనూ వారి వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు చేస్తారు. పూర్వం చనిపోయిన వ్యక్తి మళ్లి బ్రతుకుతాడనే నమ్మకం కూడా ఉండేది.

AndraPradesh : పార్క్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఈ ప్రదేశం ఏంటంటే?
Funeral Park
B Ravi Kumar
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 02, 2024 | 1:35 PM

Share

మనిషి జీవితంలో ఆఖరి మజిలి అంతిమ యాత్ర.. చనిపోయిన తరువాత అన్ని మతాల్లోనూ వారి వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు చేస్తారు. పూర్వం చనిపోయిన వ్యక్తి మళ్లీ బ్రతుకుతాడనే నమ్మకం కూడా ఉండేది. ఇప్పటికి అంతిమ యాత్ర సమయంలో మూడుసార్లు పాడెను కిందకు దించి కొడుకో, లేక ఖర్మ చేసే కూతురితోనో చనిపొయిన వ్యక్తి చెవిలో మృతుడిని పేరుతో పిలుస్తారు.

ఇక స్మశానానికి వెళ్ళిన తరువాత పాడే పై మృతుడిని ఉంచి  కట్టెలు పేర్చి, ఆవు నెయ్యి పోసి, గంధం చెక్కలు వేసి , నీటికుండతో కర్మ చేసే వ్యక్తి మూడు సార్లు ప్రదిక్షిణ చేస్తారు. తలకొరివి పెట్టిన తరువాత కపాలమోక్షం వరకు బంధు మిత్రులు అక్కడే ఉంటారు. ఇంతటి ప్రాధన్యత ఉన్న స్మశానాలు ఇపుడు నిర్లక్ష్యంతో చెత్తదిబ్బలుగా మారాయి.

అక్కడ మూడు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితులు దాపురించాయి. కానీ ఏపీలోని ఉమ్మడి పశ్చిమలోని ఓ ఐదు గ్రామాలు మాత్రం అలా ముక్కుమూసుకుని ఉందామని అనుకోలేదు. ఎవరో వస్తారు ఎదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు అందరు ఏకమై ఆఖరి మజిలీ సమస్యను అధిగమించారు.

ముక్కు మూసుకుని అంత్యక్రియలు జరపవలసిన పరిస్థితి నుంచి ఆహ్లాద వాతావరణంలో తమ గ్రామాల ప్రజలు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు అవరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. యలమంచిలి మండలంలోని లక్ష్మీపాలెం వడ్డీ లంక, మాట్లపాలెం, గంగడ పాలెం, నార్నిమెరక, నక్కపాలెం గ్రామస్థులు స్వచ్ఛందంగా చందాలు పోగు చేసి దక్షిణ కాశీగా పేరొందిన లక్ష్మీపాలెం వశిష్ఠ గోదావరి నదీ తీరాన ప్రకృతి సోయగల మధ్య ఒక పార్క్‌లా కైలాస వనాన్ని నిర్మించుకున్నారు. ఇక తమ గ్రామాలలో ఎవరైనా మృతి చెందితే తాము ఇబ్బంది పడవలసిన అవసరం లేదని పరిశుభ్ర వాతావరణంలో తమ ఆత్మీయుల అంత్యక్రియలు దగ్గర ఉండి జరిపిస్తామని చెప్పారు.

గిల్ సేనకు లార్డ్స్‌లో డేంజర్ బెల్స్
గిల్ సేనకు లార్డ్స్‌లో డేంజర్ బెల్స్
ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండాల్సిందే!లేదంటే ముప్పు తప్పదు
ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండాల్సిందే!లేదంటే ముప్పు తప్పదు
అదృష్టం వరించింది​.. గిరిజ‌న కార్మికుడికి దొరికిన ఖ‌రీదైన వ‌జ్రం.
అదృష్టం వరించింది​.. గిరిజ‌న కార్మికుడికి దొరికిన ఖ‌రీదైన వ‌జ్రం.
జొన్న రొట్టె తినడం వలన కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలివే!
జొన్న రొట్టె తినడం వలన కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలివే!
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
Jioలో దిమ్మదిరిగే ప్లాన్‌..రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ
Jioలో దిమ్మదిరిగే ప్లాన్‌..రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ
ప్రపంచ వింతల వెనక విస్తుపోయే రహస్యాలు.. అపార నిధులన్ని అక్కడే..
ప్రపంచ వింతల వెనక విస్తుపోయే రహస్యాలు.. అపార నిధులన్ని అక్కడే..
ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. పైలట్‌ మృతి!
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. పైలట్‌ మృతి!