వామ్మో.! మందుబాబులు మోత మోగించారుగా.. లెక్కలన్నీ ‘సలార్’ రికార్డులు దాటేశాయి..

న్యూఇయర్ తెచ్చిన కిక్కుతో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు తెగ తాగేశారు. మద్యం ఏరులైపారింది. డిసెంబర్ 31 సందర్భంగా మందు మత్తులో మునిగితేలారు. ప్రభుత్వ ఖాజానాపై కాసుల వర్షం కురిపించారు.

వామ్మో.! మందుబాబులు మోత మోగించారుగా.. లెక్కలన్నీ 'సలార్' రికార్డులు దాటేశాయి..
Liquor Sales
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2024 | 1:15 PM

న్యూఇయర్ తెచ్చిన కిక్కుతో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు తెగ తాగేశారు. మద్యం ఏరులైపారింది. డిసెంబర్ 31 సందర్భంగా మందు మత్తులో మునిగితేలారు. ప్రభుత్వ ఖాజానాపై కాసుల వర్షం కురిపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి..ఒక్క రోజులోనే కోట్ల ఆదాయం వచ్చింది. ఎంతలా అంటే..! ఏకంగా ప్రభాస్ ‘సలార్’ మూవీ రికార్డులను దాటేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో న్యూఇయర్ వేళ భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ కావడంతో మద్యం దుకాణాల దగ్గర భారీగా క్యూ కట్టారు మందుబాబులు. దీంతో మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.147 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. సాధారణ రోజుల్లో రూ.75 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతుండగా.. డిసెంబర్ 31 సందర్భంగా లిక్కర్ సేల్ ఓ రేంజ్‌లో పెరిగింది.

అదే విధంగా తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. మూడు రోజుల్లో రూ.625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి..న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కరోజే రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందర్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.