AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ఏపీకి వర్ష సూచన.. మరో రెండు రోజులు ఆంధ్రాలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Rain Alert In AP: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి.

Rain Alert: ఏపీకి వర్ష సూచన.. మరో రెండు రోజులు ఆంధ్రాలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Rain Alert
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2021 | 8:04 AM

Share

Rain Alert In AP: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మహారాష్ట్రలోనని విదుర్భ ప్రాంతంలో బలహీనపడింది. దీనికి అనుగుణంగానే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే అల్పపీడనం ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీంతో రాబోయే రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా ఆ జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

బుధవారం, గురువారం ఉత్తరాంధ్రాతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లుగా విశాఖ వాతవరణ కేంద్రం ప్రకటించింది. ఆ రెండు జిల్లాల్లోని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక గత రెండు రోజులుగా.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అటు గ్రామీణ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లాయి. రహదారులు పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. నిన్న శ్రీకాకులం జిల్లా సీతంపేటలో అత్యధికంగా 11.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే విజయనగరం జిల్లా మెరకముడిదంలో 7, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 6.4, ప్రకాశం జిల్లా టంగుటూరులో 6.2, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 5.3, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో 5.2, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read: SBI Savings Plus Account: ఎస్‌బీఐలో మీ అకౌంట్‌ను ఇలా మార్చండి.. ఎక్కువ బెనిఫిట్స్‌ పొందవచ్చు..

TS Schools Reopen: నేటి నుంచి తెలంగాణలో స్కూళ్లు పున:ప్రారంభం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ORR Road Accident: ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-టిప్పర్ ఢీ.. ఎంపీటీసీ దంపతుల దుర్మరణం

Jabardasth Avinash: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న జబర్ధస్త్ అవినాష్.. ఎంగెజ్‏మెంట్ ఫోటోస్ వైరల్… అమ్మాయి ఎవరంటే..