పిల్లలు కాదు, బాల సైంటిస్టులు .. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్దులు.. సైకిల్‌తో పనిచేసే గ్రైండర్, మిక్సీ తయారుచేసి..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 29, 2023 | 5:30 PM

Annamayya District News: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులు తమ ప్రతిభను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వారికి అందుబాటులో ఉన్న పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో మహిళలకు ఎంతో అవసరం అయిన మిక్సీని గ్రైండర్‌ను కరెంట్ పనిలేకుండా చక్కగా పని చేసేలా తయారు చేసి అందరితో ఔరా అనిపించుకున్నారు. సైకిల్‌తో తిరిగే గ్రైండర్, మిక్సీలు పనిచేసే విధానం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం పైగా కెరెంట్ బిల్ లేదు. ఇదంతా చూసిన పాఠశాల తొటి విద్యార్దులు..

పిల్లలు కాదు, బాల సైంటిస్టులు .. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్దులు.. సైకిల్‌తో పనిచేసే గ్రైండర్, మిక్సీ తయారుచేసి..
Vishnu Vardhan And Tejeswar's Invention
Follow us on

అన్నమయ్య జిల్లా, ఆగస్టు 29: కరెంటు వినియోగం లేకుండా గ్రైండర్ మిక్సీ తయారుచేసి తమ మేధో శక్తికి తిరుగు లేదంటూ జాతీయ స్థాయిలో నిరూపించుకున్నారు రైల్వే కోడూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు . హిందీలో త్రీ ఇడియట్స్ , తెలుగులో స్నేహితులు సినిమాల చివరిలో పిల్లలు తమ మేధో శక్తితో తక్కువ ఖర్చుతో ఉపయోగపడే వస్తువులను తయారు చేసి వాడి వాడకాన్ని చూపిస్తారో అదే విధంగా సైకిల్ తొక్కుతుంటే గ్రైండర్, మిక్సీలు పనిచేసే విధంగా రైల్వేకోడూరు విద్యార్థులు వాటిని తయారు చేసి అందరినీ అబ్బురపరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులు తమ ప్రతిభను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వారికి అందుబాటులో ఉన్న పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో మహిళలకు ఎంతో అవసరం అయిన మిక్సీని గ్రైండర్‌ను కరెంట్ పనిలేకుండా చక్కగా పని చేసేలా తయారు చేసి అందరితో ఔరా అనిపించుకున్నారు. సైకిల్‌తో తిరిగే గ్రైండర్, మిక్సీలు పనిచేసే విధానం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం పైగా కెరెంట్ బిల్ లేదు. ఇదంతా చూసిన పాఠశాల తొటి విద్యార్దులు, చుట్టుపక్కల ప్రజలు.. విష్ణు వర్దన్ , తేజేశ్వర్ అనే విద్యార్దులను శభాష్ అంటున్నారు. అంతేకాక సైకిల్ పనిచేసే ఈ రెెండు పరికరాలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వీరి ప్రతిభ జీతాయస్దాయిలో కూడా మెరవనుంది.

సైన్స్ టీచర్ ప్రోత్సాహంతోనే ఈ పరికకాల తయారీ..

సైకిల్‌తో తిరిగే గ్రైండర్, మిక్సీ లాంటి పరికరాల తయారీకి తమ గురువు సైన్స్ టీచర్, వెబినైజర్ ప్రోత్సాహించారని విద్యార్దులు విష్ణు వర్దన్, తేజేశ్వర్ అన్నారు. తమకు సైన్స్‌పై ఉన్న మక్కువను గమనించిన టీచర్ మరింత ప్రోత్సాహాన్ని అందించడంతో ఈ పరికరాలు తయారు చేశామని విద్యార్దులు అన్నారు. ప్రస్తుత కాలంలో కరెంట్ వినియోగం ఎక్కువైందని అంతేకాక.. ఇంట్లో ముఖ్యంగా వాడే గ్రైండర్ , మిక్సీలు ఎక్కువ కరెంట్ వినియోగించుకుంటాయని అందుకే కరెంట్‌తో పనిలేకుండా చక్కగా సైకిల్ తొక్కుతూ గ్రైండర్, మిక్సీని వాడటం వలన ఆరోగ్యంతో పాటు కరెంట్ కూడా సేవ్ అవుతుందని విద్యార్దులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

 జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సైకిల్ గ్రైండర్ , సైకిల్ మిక్సి

జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు విష్ణువర్ధన్, తేశ్వర్ చేసిన పరికరాలు ఎంపిక కావడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు తల్లిదండ్రులు, రైల్వే కోడూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ సైన్సు టీచర్ వేపరాల విబినెజర్ ప్రోత్సాహంతో పాటు ఆయన సలహాలు సూచనలతో ప్రజా ఉపయోగకరమైన పరికరాలను కనిపెట్టారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ చిన్నారులు తెలివి జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశవ్యాప్తంగా ఇలాంటి కాలుష్యం విద్యుత్ అవసరంలేని పరికరాలను వినియోగించేలా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచాలని పాఠశాల ఉపాద్యాయులు కోరుకుంటున్నారు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇటువంటి అద్భుత ప్రతిభ కనబరుస్తున్న చిన్నారులను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..