Proddatur MLA: ఆయన మంత్రి కాదు.. శాసనసభ సభ్యుల్లో ఆయనొకరు.. వీరాభిమానం చాటుకున్న పోలీసులు!
ఆయన మంత్రి కాదు. అలాగని ప్రభుత్వ పదవిలోనూ లేరు. వందల మంది ఎమ్మెల్యేల్లో ఆయనొకరు. ఎందుకో తెలియదు కానీ.. ఆ నేతపై వీరాభిమానం చాటుకున్నారు పోలీసులు. ఆయన బర్త్‌డే వేడుకల్లో నానా హంగామా చేశారు. గజమాలతో ఘనంగా సత్కరించారు.
MLA Siva Prasad Reddy Birthday celebrations: ఆయన మంత్రి కాదు. అలాగని ప్రభుత్వ పదవిలోనూ లేరు. వందల మంది ఎమ్మెల్యేల్లో ఆయనొకరు. ఎందుకో తెలియదు కానీ.. ఆ నేతపై వీరాభిమానం చాటుకున్నారు పోలీసులు. ఆయన బర్త్‌డే వేడుకల్లో నానా హంగామా చేశారు. గజమాలతో ఘనంగా సత్కరించారు. అంతటితో ఆగకుండా ఓ భారీ కేక్‌ను ఎమ్మెల్యేతో కట్ చేయించి తమ స్వామిభక్తి చాటుకున్నారు. ఇంతకీ, ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు. ప్రొద్దుటూరు MLA శివప్రసాద్‌రెడ్డి. ఆ పోలీసులంతా ఆయన నియోజవర్గంలోని సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు కావడం విశేషం.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రక్షక భటులు చేసిన ఓ యవ్వారం ఇప్పుడు సంచలనంగా మారింది. యూనిఫామ్‌లో వెళ్లిమరీ ప్రొద్దుటూరు MLA శివప్రసాద్‌రెడ్డి వేడుకల్లో పోలీసులు హడావిడి చేశారు. ప్రొద్దుటూరు రూరల్ సీఐ మధుసూదన్ గౌడ్, ఎస్సైలు శివశంకర్, సంజీవరెడ్డి, రాజుపాలెం ఎస్సై కృష్ణంరాజు కలిసి MLA బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించడం కలకలం రేపుతోంది. స్వయాన MLA ఇంట్లో కానిస్టేబుళ్లను సైతం తీసుకెళ్లి రాచమల్లును గజమాలతో సత్కరించి.. ఆయనతో భారీ కేక్ కట్ చేయించారు. ఇదే పోలీస్ పెద్దలు నానా హంగామా చేయడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రేషన్స్ వారి విమర్శలకు బూస్ట్ ఇచ్చినట్లైంది. పోలీస్ అధికారులు యూనిఫామ్‌లో ఓ MLA ఇంటికెళ్లి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించడాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించారు. తాము ప్రభుత్వ అధికారులమనే సంగతి మర్చిపోయారా అంటూ మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిందనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని విమర్శిస్తున్నారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న పోలీస్ అధికారులపై డీజీపీ వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నాయకులు.
Read Also…. స్టైలిష్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న రామ్ పోతినేని