Ongole Road Accident: ఒంగోలులో గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడ దగ్గర రోడ్డుపై వాహనాలు ఎప్పటిలాగే వేగంగా వెళుతున్నాయి. అదే సమయంలో గ్యాస్ సిలిండర్ల లారీ రోడ్డుపై వేగంగా వస్తోంది. నిండుగా ఉన్న 342 ఇండేన్ గ్యాస్ సిలండర్లతో లారీ డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. కొండపల్లి నుంచి ఇంకొల్లు వెళుతుండగా మార్గ మధ్యంలో బోడవాడ దగ్గర ఆటో ఎదురైంది. వేగంగా వెళుతున్న లారీ హఠాత్తుగా ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి బొల్తా కొట్టింది. లారీలో నిండు సిలిండర్లు ఉండటంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి కిందకు దూకేశారు. లారీ రోడ్డు పక్కన తలకిందులుగా..

ఒంగోలు, నవంబర్ 13: గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా… తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న డ్రైవర్,క్లీనర్… ఒక్కటి పేలినా బీభత్సం జరిగేది. గ్యాస్ లారీ బోల్తా పడిన ఘటనలో ఒక్క సిలిండ్ పేలినా దీపావళి బాంబుల్లా సిలిండర్లు పేలిపోయేవి. రోడ్డుపై నానా బీభత్సం జరిగేది. వాహనాల రాకపోకల్లో పలువాహనాలు ధ్వంసం అయ్యేవి. ఈ బీభత్సం తలచుకుంటేనే గుండెలు గుభేలుమంటున్నాయి. అలాంటి ప్రమాదం లేకుండా లారీ డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడటంతో అక్కడి గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడ దగ్గర రోడ్డుపై వాహనాలు ఎప్పటిలాగే వేగంగా వెళుతున్నాయి. అదే సమయంలో గ్యాస్ సిలిండర్ల లారీ రోడ్డుపై వేగంగా వస్తోంది. నిండుగా ఉన్న 342 ఇండేన్ గ్యాస్ సిలండర్లతో లారీ డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. కొండపల్లి నుంచి ఇంకొల్లు వెళుతుండగా మార్గ మధ్యంలో బోడవాడ దగ్గర ఆటో ఎదురైంది. వేగంగా వెళుతున్న లారీ హఠాత్తుగా ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి బొల్తా కొట్టింది. లారీలో నిండు సిలిండర్లు ఉండటంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి కిందకు దూకేశారు. లారీ రోడ్డు పక్కన తలకిందులుగా బోల్తా పడింది. వెంటనే కిందకు దూకేసిన డ్రైవర్, క్లీనర్ లారీకి దూరంగా వెళ్ళిపోయారు. రోడ్డుపై వస్తున్న వాహనాలను రావద్దంటూ కేకలు వేశారు. దీంతో రోడ్డుపై వస్తున్న ఇతర వాహనాలు ఆపేశారు.
లారీలోని సిలిండర్లు పేలే అవకాశం ఉండటంతో కొద్దిసేపు వేచి చూశారు. అదృష్టవశాత్తూ సిలిండర్లు పేలలేదు. పొరపాటున ఒక్క సిలిండర్ పేలినా మిగిలిన సిలిండర్లు కూడా పేలిపోయి రోడ్డుపైనే బీభత్సమైన దీపావళి సినిమా కనిపించేది. అయితే లారీ బోల్తా పడటం మినహాయించి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, చీరాల అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సిలండర్ల నుండి ఎలాంటి గ్యాస్ లీక్ కావడం లేదని అగ్నిమాపక సిబ్బంది ధృవీకించుకున్నారు. గ్యాస్ సిలండర్లను మరొక లారీలో లోడ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి సూచనలు చేశారు. రోడ్డుపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా కొట్టిన తరువాత ఎలాంటి పెను ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.