AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్‌కు ఏమిచ్చారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖలు కేటాయించారు. మహిళా మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు హోం అఫైర్స్, విప‌త్తు శాఖ కేటాయించారు. మరి పవన్ కల్యాణ్, నారా లోకేశ్.. మిగిలిన ఇతర మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారో తెలుసుకుందాం పదండి...

Andhra Pradesh: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్‌కు ఏమిచ్చారంటే..?
Andhra Ministers
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 14, 2024 | 3:13 PM

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం కూడా కంప్లీట్ అయింది. తాజాగా కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. 24మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు దిగువన చూడండి

  1. చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) –   సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు,  జీఏడీ, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు)
  2.  కొణిదెల పవన్ కళ్యాణ్ (ఉప ముఖ్యమంత్రి) – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
  3. నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టీజీ
  4. కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్‌, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్యశాఖ
  5. కొల్లు రవీంద్ర – గనులు అండ్‌ జియాలజీ, ఎక్సైజ్‌
  6. నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు
  7. పి.నారాయణ –  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
  8. వంగలపూడి అనిత –  హోంశాఖ, విపత్తు నిర్వహణ
  9. సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ
  10. నిమ్మల రామానాయుడు  – జలవనరుల అభివృద్ధి శాఖ
  11. ఎన్.ఎమ్.డి.ఫరూక్  – మైనార్టీ, న్యాయశాఖ
  12. ఆనం రామనారాయణరెడ్డి  – దేవాదాయశాఖ
  13. పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్‌ ట్యాక్సెస్‌, శాసనసభ వ్యవహారాలు
  14. అనగాని సత్యప్రసాద్ –  రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ
  15. కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణం, సమాచార శాఖ
  16. డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ
  17. గొట్టిపాటి రవి కుమార్  –  విద్యుత్‌ శాఖ
  18. కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ
  19. గుమ్మడి సంధ్యారాణి –  గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ
  20. బీసీ జనార్థన్ రెడ్డి –  రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు
  21. టీజీ భరత్ –   పరిశ్రమలు, వాణిజ్యం
  22. ఎస్.సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత సంక్షేమం, జౌళి
  23. వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ
  24. కొండపల్లి శ్రీనివాస్ – చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు
  25. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి  – రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..