Watch Video: బాల్యంలోనే బ్రహ్మండమైన రికార్డ్.. చిన్నారి మెమరీ పవర్ అదుర్స్.. ఔరా అంటున్న స్థానికులు..
అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన నాలుగు నెలల చిన్నారి అరుదైన రికార్డు సాధించింది. నాలుగు నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను.. అంటే ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులను, పండ్లను అలవోకగా గుర్తిస్తుంది. గుంతకల్లు పట్టణానికి చెందిన రైల్వే ఉద్యోగి సుధాకర్, సింధు దంపతుల నాలుగు నెలల పాప క్రిస్టినా సియారా ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫ్లాష్ కార్డులను గుర్తించడంలో అతిపిన్న వయసు గల చిన్నారిగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది.

అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన నాలుగు నెలల చిన్నారి అరుదైన రికార్డు సాధించింది. నాలుగు నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను.. అంటే ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులను, పండ్లను అలవోకగా గుర్తిస్తుంది. గుంతకల్లు పట్టణానికి చెందిన రైల్వే ఉద్యోగి సుధాకర్, సింధు దంపతుల నాలుగు నెలల పాప క్రిస్టినా సియారా ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫ్లాష్ కార్డులను గుర్తించడంలో అతిపిన్న వయసు గల చిన్నారిగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. జూన్ 7న ఆన్లైన్లో చిన్నారి ఫ్లాష్ కార్డులను గుర్తించడాన్ని వీక్షించిన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు.. చిన్నారి క్రిస్టినా సియారాకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందించారు.
గతంలో కర్ణాటకకు చెందిన ఓ చిన్నారి కూడా 125 ఫ్లాష్ కార్డులను గుర్తించి రికార్డు సృష్టిస్తే.. నాలుగు నెలల చిన్నారి క్రిస్టినా 149 ఫ్లాష్ కార్డులను గుర్తించి రికార్డు బ్రేక్ చేసింది. నాలుగు నెలల చిన్నారి క్రిస్టినా సాధించిన రికార్డు తెలుసుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.. ఆ చిన్నారి తల్లిదండ్రులను పిలిపించుకుని అభినందించారు. క్రిస్టినాకు ఎంతో ప్రతిభ ఉందని ప్రశంసించారు కలెక్టర్. ఇలా అన్నీ అలవోకగా గుర్తుపట్టేస్తున్న చిన్నారి వీడియోను చూసిన వారందరూ ఔరా.. అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..