polavaram diaphragm wall : పోలవరం డ్రయాఫ్రం వాల్ దెబ్బతినడంపై అనిల్ – దేవి మధ్య పొలిటికల్ ఫైట్
polavaram diaphragm wall : ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం అంశంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. పోలవరం డ్రయాఫ్రం వాల్ దెబ్బతినడంపై ప్రస్తుత, గత ప్రభుత్వంలోని మంత్రులు అనిల్, దేవినేని..
polavaram diaphragm wall : ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం అంశంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. పోలవరం డ్రయాఫ్రం వాల్ దెబ్బతినడంపై ప్రస్తుత, గత ప్రభుత్వంలోని మంత్రులు అనిల్, దేవినేని ఉమ మధ్య పొలిటికల్ ఫైట్ కాకరేపుతోంది. ఎవరి వల్ల ఆ నష్టం వచ్చిందనే దానిపై దేవినేని ఉమకు, అనిల్‌కు మధ్య మాటకు మాట నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి ఉమ. నిన్న ఉమ చేసిన కామెంట్స్‌కు ఇవాళ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి అనిల్. తప్పులు చేసి… బురద తమపై వేస్తారా అని ప్రశ్నించారు. ఇంకా ఆయన చాలా సీరియస్ కామెంట్సే చేశారు. డయా ఫ్రం వాల్ దెబ్బతినడం, స్పిల్ వే కట్టకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణమా..? అంటూ ప్రశ్నలు సంధించారు అనిల్.
ఇలా ఉంటే, బుధవారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమ పోలవరం ప్రాజెక్టును వైసీపీ సర్కారు భ్రష్టుపట్టించిందన్నారు. డయాఫ్రం వాల్ పనులు హడావిడిగా పూర్తిచేశారంటూ ఆరోపించారు. పోలవరం పవర్ ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు. ఇలా ప్రాజెక్టుకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తారు ఉమ. వీటికి తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యారు.