AP Politics: సయ్యంటారా.. సైడవుతారా.. నెల్లూరు సెంటర్‌లో ఇదొకటే డిస్కషన్.. ఎవరి గురించో తెలుసా..

మైనస్ మార్కులుంటే నో సీట్.. ఇదీ వైసీపీలో జరుగుతున్న హాట్ డిస్కషన్.. హిట్‌లిస్టులో ఉన్న ఆ మాజీమంత్రి మాత్రం తన బెర్త్‌ కన్ఫర్మ్.. మళ్లీ మంత్రిని కూడా అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్‌ ఇచ్చేస్తున్నారు. దమ్ముంటే పోటీకి రండి అంటూ ముగ్గురికి సవాళ్లు కూడా విసిరారు.. ఆ ముగ్గురిలో ఆయన తొడగొట్టిన లోకేష్‌ రాలేదుగానీ పాత ప్రత్యర్థే వచ్చారు. మరి అనిల్ పరిస్థితేంటి? ఆయనకు టికెట్‌ దక్కుతుందా? ఆయన సవాల్‌ నెగ్గుతుందా?

AP Politics: సయ్యంటారా.. సైడవుతారా.. నెల్లూరు సెంటర్‌లో ఇదొకటే డిస్కషన్.. ఎవరి గురించో తెలుసా..
Anil
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2023 | 9:50 PM

ట్రంక్ రోడ్డు సర్కిల్ నుంచి మొదలు.. నెల్లూరు సిటీలోని ప్రతీ వీధిలో వారం రోజుల్నించీ ఒకటే డిస్కషన్. మాజీమంత్రి అనిల్ మరో మాజీమంత్రి నారాయణ పోటీ వ్యవహారం. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక అనూహ్యంగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు పొంగూరు నారాయణ. 2019లో ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా కేబినెట్‌లో కంటిన్యూ అయ్యారు. తర్వాత పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తారని కొందరు.. చేయరని మరికొందరు చర్చిస్తుంటే.. మాజీమంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నారాయణని పోటీకి రమ్మను ఓడించి హ్యాట్రిక్ కొడతా.. నారాయణకు మాత్రం రెండు వందల కోట్లు నష్టం అంటూ సవాల్ విసిరారు.

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పొలిటికల్ కెరీర్ 1983లో నెల్లూరు సిటీలోనే మొదలైంది. దీంతో అవకాశం ఉంటే ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఉందని ఆనం చెప్పారో లేదో అనిల్‌కుమార్‌ తొడగొట్టారు. నేను సై.. దమ్ముంటే రా.. గెలిచి నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ ఆనంపైనా మీసం మేలెశారు. నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నువ్వు ఓడిపోతే నీ రాజకీయ జీవితాన్ని నేనే ముగించేస్తా అంటూ రీసౌండ్ వచ్చేలా ఛాలెంజ్ విసిరారు అనిల్‌కుమార్‌యాదవ్‌. దీంతో నారా లోకేష్ యువగళం యాత్రలో స్పందిస్తూ ముందు నీకు సత్తా ఉంటే జగన్ నుంచి టికెట్‌ తెచ్చుకో చూద్దాం అంటూ సెటైర్ వేశారు. తగ్గేదేలేదంటూ మళ్లీ మైక్ అందుకున్న అనిల్ కుమార్ ఈసారి ఛాలెంజ్ నారా లోకేష్‌కి విసిరారు.. నాతో తలపడి గెలువు.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేకుంటే నువ్వు పాలిటిక్స్ వదిలేస్తావా అంటూ సవాల్ విసిరారు.

ముచ్చటగా ముగ్గురికి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సవాల్‌ చేసి మరోసారి తొడసరిచేసుకుంటున్న సమయంలో.. మాజీమంత్రి నారాయణని నెల్లూరు సిటీ ఇంచార్జ్‌గా నియమించింది టీడీపీ అధిష్ఠానం.. దీంతో అనిల్‌కుమార్‌ పాత ప్రత్యర్థే మళ్లీ పోటీలో ఉండారన్నది కన్‌ఫం అయ్యింది.. టీడీపీనుంచి ఎవరన్నది లైన్‌క్లియర్‌. మరి వైసీపీనుంచి ఈసారి అనిల్‌కి టికెట్ దక్కుతుందా.. అంత స్ట్రాంగ్‌గా చెప్పుకుంటున్న మాజీ మంత్రికి వైసీపీ అధిష్ఠానం హామీ ఇస్తుందా లేదా అన్న టాక్ నడుస్తోంది. హిట్ లిస్ట్‌ నుంచి బయట పడేందుకే అనిల్ దూకుడు పెంచారన్న గుసగుసలు పార్టీలో నడుస్తున్నాయి. అనిల్‌కుమార్‌కి మరోసారి నెల్లూరుసిటీనుంచి అవకాశం ఉంటుందా.. సవాళ్లు సరే.. వాటిని విసిరిన నాయకుడే బరిలో ఉంటారా లేదా అనేది హాట్ టాపిక్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!