Anantapuram: నారా లోకేష్‌పై ఎవరు దాడి చేయలేదు.. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
Anantapuram: అనంతపురం జిల్లాలో ఇంధన, అటవీ, భూగర్బ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లా రివ్యూ..
Anantapuram: అనంతపురం జిల్లాలో ఇంధన, అటవీ, భూగర్బ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లా రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లా ఏర్పాటు అయ్యాక తొలిసారి రివ్యూ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా కూడా నాకు చిత్తూరు జిల్లా లానే అనిపిస్తుంది. అందరం కలిసి జిల్లాను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి. అధికారులందరూ శాసనసభ్యులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. సమస్యలు ఏమున్న కలెక్టర్ దగ్గరకు తీసుకురావాలని, జిల్లాలో పెద్ద సమస్యలు ఏమున్నా వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి సూపరిపాలన కొనసాగిస్తు్న్నారని అన్నారు. గ్రామ సచివాలయాల సహకారం తో ప్రజా సమస్యలు తోలిగెలా అందరూ చూడాలన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలందరూ నిర్భయంగా ఉండవచ్చని, దిశా పోలీస్ స్టేషన్, దిశా యాప్ అంటూ మహిళలు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో పోలీసులు స్పాట్ లో ఉంటున్నారన్నారు. ఎక్కడో ఒక్క చోట జరిగిన ఘటనను కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని, లోకేష్ పైన ఎవరు దాడి చేయలేదు, రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి