Nellore District: అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థికి ఊహించని షాక్.. పరీక్షహాల్ లో ఇలా..
Mistake in Hall Ticket: నెల్లూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం పదో తరగతి(SSC Exams) విద్యార్థికి ఏడాది కాలం నిరుపయోగంగా చేసింది. ఎంతో కష్టపడి చదువుకున్న అతడికి.. హాల్ టికెట్‌లో జరిగిన ఒక తప్పు శాపంగా మారింది.
Mistake in Hall Ticket: నెల్లూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం పదో తరగతి(SSC Exams) విద్యార్థికి ఏడాది కాలం నిరుపయోగంగా చేసింది. ఎంతో కష్టపడి చదువుకున్న అతడికి.. హాల్ టికెట్‌లో జరిగిన ఒక తప్పు శాపంగా మారింది. తప్పిదం వల్ల సబ్జెక్టుల మార్పు కారణంగా ఇప్పటివరకు జరిగిన రెండు పరీక్షల్లో ఫెయిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన మోడెం శివకుమార్ ఆత్మకూరు మండలం కరటంపాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడికి ఈ నెల 26న పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్ -2217121499 వచ్చింది. దాన్ని తీసుకున్న విద్యార్థి 27న అతనికి కేటాయించిన మేరిస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ సెంటర్లో పరీక్షకు హాజరయ్యాడు.
ఇన్విజిలేటర్ పరీక్ష హాలులో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు పేపర్(Telugu Paper) ఇవ్వగా.. శివకుమార్‌కు మాత్రం స్పెషల్ హిందీ పేపర్(Special Hindi) ఇచ్చారు. దానిని చూడగానే ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ విద్యార్థి.. ఎందుకు అలా జరిగిందో పాలుపోక వెంటనే సదరు ఇన్విజిలేటర్ ను అడిగాడు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పాలని ప్రయత్నించినా.. బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని వారు చెప్పారు. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చి.. పై స్థాయిలో పొరపాటు జరగడం వల్ల సబ్జెక్టు మారిందని తెలిపారు. మరో నెల రోజుల్లో జరిగే సప్లిమెంటరీలో రాయాల్సి ఉంటుందని చెప్పడంతో విద్యార్థి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ఎలాగైనా పాస్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చి.. విద్యార్థితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. కానీ.. రెండో రోజు కూడా అతడు షాక్ అయ్యాడు. హిందీ పరీక్ష రాయాల్సి ఉండగా.. మళ్లీ స్పెషల్ తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇవ్వడంతో నిర్వెరపోయాడు. విద్యా సంవత్సరం నాశనమైందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే విద్యార్థులు హాల్ టికెట్ తీసుకునేసమయంలోనే వాటిని ఒక సారి సరిచూసుకోవాలని డీఈవో సూచించారు. తప్పులు ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని వారు చెబుతున్నారు. అలా చేసి ఉంటే తప్పును సరిచేసే అవకాశం ఉండేదని డీఈవో అంటున్నారు.
ఇవీ చదవండి..
E-commerce: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లకు ఎదురుదెబ్బ.. ఈ-కామర్స్ వ్యాపారంలోకి ప్రభుత్వం..!
Amazon Prime Videos: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త సినిమాలకు ముందుగానే యాక్సెస్..