AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Woman Murder: పోస్టుమార్టం జరగకుండానే అత్యాచారం జరగలేదంటారా.. ఎస్పీ ప్రకటనపై తుమ్మపూడి మృతురాలి భర్త ఆగ్రహం..

ఏపీలో సంచలనం రేపిన తుమ్మపూడి మహిళ అత్యాచారం, హత్య కేసు(Tummapudi) ఊహించని మలుపు తిరుగుతోంది. యువతిపై అత్యాచారం జరగలేదని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పడంపై మండిపడుతున్నాడు మృతురాలి భర్త.

Guntur Woman Murder: పోస్టుమార్టం జరగకుండానే అత్యాచారం జరగలేదంటారా.. ఎస్పీ ప్రకటనపై తుమ్మపూడి మృతురాలి భర్త ఆగ్రహం..
Tummapudi Woman Rape And Mu
Sanjay Kasula
|

Updated on: Apr 29, 2022 | 1:44 PM

Share

ఏపీలో సంచలనం రేపిన తుమ్మపూడి మహిళ అత్యాచారం, హత్య కేసు(Tummapudi) ఊహించని మలుపు తిరుగుతోంది. యువతిపై అత్యాచారం జరగలేదని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పడంపై మండిపడుతున్నాడు మృతురాలి భర్త. నా భార్య మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండానే అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు . రాజకీయ నాయకులతో ఒప్పందం చేసుకుని ఎస్పీ అలా చెప్పాడని అర్థమవుతోందంటూ ఆరోపించాడు. ఎస్పీ తన మాటల్ని వెనక్కు తీసుకోకపోతే పోలీస్‌ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు, ఎస్పీకి కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు కదా..ఇంకో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అంటూ మండిపడ్డాడు బాధితుడు.

తిరుపతమ్మ భర్త ఆరోపణలు తప్పో ఒప్పో కోర్టు నిర్థారిస్తుందన్నారు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌. ప్రాధమిక ఆధారాలతో ఏంజరిగిందో చెప్పానన్నారు.దీంట్లో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. మృతురాలి కుటుంబీకులు గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని ఆరోపిస్తుంటే, పోలీసుల వాదన మరోలా ఉంది. మృతురాలితో నిందితుడికి వివాహేతర సంబంధం ఉందని, అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

అయితే ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నేతలు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. మహిళలపై అత్యాచారాలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో కామాంధులు రెచ్చిపోతున్నారని, వీరి అరాచకాలకు కళ్లెం వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు మహిళా సంఘాల నేతలు. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా కుటుంబీకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తుమ్మపూడికి చెందిన మహిళ పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తోంది. భర్త శ్రీనివాసరావు.. వీరికి ఇద్దరు పిల్లలు.. అయితే భర్త శ్రీనివాసరావు పని కోసం తిరుపతి వెళ్లగా.. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండటం కలకలం రేపింది. మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు ముందుగా పోలీసులు గుర్తించారు.

ఆమెపై దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా మొదట భావించారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. తెలిసినవారే తిరుపతమ్మను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఈ కేసులో శివరామకృష్ణ, సాయి, చరణ్‌.. ఈ ముగ్గురు వ్యక్తులపైనే భర్త శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నాడు. కొంతకాలంగా తన భార్యను ఫోన్‌లో వేధిస్తున్నారన్న శ్రీనివాస రావు.. ఈ విషయంపై గతంలో గొడవ కూడా జరిగిందంటున్నాడు. నిన్న తమ ఇంటి సమీపంలోనే ఈ ముగ్గురు వ్యక్తులు మద్యం తాగారని శ్రీనివాసరావు చెప్తున్నాడు.

క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి: Health Tips: ఆహారం తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..

Back Pain Remedies: వెన్నునొప్పికి దాల్చిన చెక్కతో ఉపశమనం.. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనం..

Tea and Diabetes: ఈ స్పెషల్ టీ డయాబెటిక్ పేషెంట్‌కి దివ్యౌషధం.. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇలా వాడండి..