AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలో వచ్చి రోడ్డుపై పట్టుబడ్డారు.. తిక్క కుదిరి కిక్కు వదిలింది..

అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు చేశారు. బాట జంగాల పాలెం టోల్గేట్ వద్ద కాపు కాసిన పోలీసులకు అనుమానస్పదంగా ఒక కారు కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల సీజన్ సమీపిస్తుంది. దీంతో పోలీసులు నిఘా పెంచ్చారు. ఎక్కడికక్కడ ఫ్లాగ్ మార్చ్‎లు నిర్వహిస్తున్నారు. శివార్లలో కాపుకాసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తాజాగా.. గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు నిర్వహించారు.

విమానంలో వచ్చి రోడ్డుపై పట్టుబడ్డారు.. తిక్క కుదిరి కిక్కు వదిలింది..
Illigal Liquor
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 11, 2024 | 4:20 PM

Share

అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు చేశారు. బాట జంగాల పాలెం టోల్గేట్ వద్ద కాపు కాసిన పోలీసులకు అనుమానస్పదంగా ఒక కారు కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల సీజన్ సమీపిస్తుంది. దీంతో పోలీసులు నిఘా పెంచ్చారు. ఎక్కడికక్కడ ఫ్లాగ్ మార్చ్‎లు నిర్వహిస్తున్నారు. శివార్లలో కాపుకాసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తాజాగా.. గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు నిర్వహించారు.

బాట జంగాల పాలెం టోల్గేట్ వద్ద కాపు కాసిన పోలీసులకు అనుమానస్పదంగా ఒక కారు కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించాయి. వెరిఫై చేసి గోవా లిక్కర్‎గా గుర్తించారు పోలీసులు. 61 మద్యం పోటీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురిని విచారించారు. గోవా నుంచి విమానంలో బయలుదేరి.. విశాఖ ఎయిర్ పోర్టులో దిగి.. ఆ తర్వాత కాకినాడకు కారులో వెళ్తున్నారు. అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీల్లో పట్టుబడిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతం చేశారు పోలీసులు. పట్టుబడిన మద్యం విలువ రూ.30 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us