Ongole IIIT: ఉన్నత విద్య కోసం వెళ్లి ఉపవాసముంటున్న విద్యార్థులు.. సమస్య ఏంటంటే..

అది రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ విద్యా సంస్థ. కానీ ఓ సమస్య అక్కడ విద్యార్థులను గత కొంత కాలంగా వెంటాడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. గతంలోనే పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్‎కు నోటీసులు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప విద్యార్థుల బాధ ఏమాత్రం తీరలేదు. నాణ్యమైన ఆహారం అందక ఆకలి కేకలతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది.

Ongole IIIT: ఉన్నత విద్య కోసం వెళ్లి ఉపవాసముంటున్న విద్యార్థులు.. సమస్య ఏంటంటే..
Ongole Iiit
Follow us
B Ravi Kumar

| Edited By: Srikar T

Updated on: Mar 11, 2024 | 4:48 PM

ఏలూరు, మార్చి 11: అది రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ విద్యా సంస్థ. కానీ ఓ సమస్య అక్కడ విద్యార్థులను గత కొంత కాలంగా వెంటాడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. గతంలోనే పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్‎కు నోటీసులు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప విద్యార్థుల బాధ ఏమాత్రం తీరలేదు. నాణ్యమైన ఆహారం అందక ఆకలి కేకలతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుని, తమ లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులకు రోజు రోజుకి సుడిగుండంలా సమస్య పెద్దదౌతుంది. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు, అధ్యాపకులు చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతలేని ఆహార భుజించి అనారోగ్యం పాలవటం కన్నా పస్తులు ఉంటేనే మేలనే భావనలోకి విద్యార్థులు వెళ్లిపోయారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది. ఆ ప్రత్యేక విద్యాసంస్థ ఏంటి.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏంటి.. ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నూజివీడు ట్రిపుల్ ఐటి. ఈ పేరు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ఫేమస్. చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడి చదివి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి తమ లక్ష్యాలు నెరవేర్చుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అయితే ఎన్నో శ్రమల నడుమ మంచి మార్కులతో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి అక్కడ చేరిన విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందక అనారోగ్యాల బారిన పడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ట్రిపుల్ ఐటీ హాస్టల్ మెస్‎లో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. క్లాస్ రూములు బాయ్‎కాట్ చేసి మరి కాంట్రాక్టర్‎పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మెస్ కాంట్రాక్టర్ అందించే రైస్, కూరలు నాణ్యంగా ఉండడం లేదంటూ, నాసిరకం సరుకులతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో ఆ కాంట్రాక్టర్కు అప్పట్లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉపాధ్యాయులు నోటీసులు జారీ చేశారు. అంతేకాక విద్యార్థులతో ఆహార నాణ్యతపై కమిటీ వేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని తీర్మానం చేశారు.

కానీ అదంతా కాగితాలకే పరిమితమైంది. తాజాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మెస్‎లో కోడి కూరలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఆదివారం మెస్‎లో చికెన్ స్పెషల్‎గా వండుతారు. అలా స్పెషల్‎గా వండిన చికెన్ కూరలో చనిపోయిన బొద్దింక విద్యార్థుల కంటపడింది. దాంతో విద్యార్థులు ఆహారాన్ని తినకుండానే వదిలేశారు. అంతేకాక విద్యార్థులు తినే అన్నంలో చిన్నచిన్న పురుగులు కూడా ప్రత్యక్షమయ్యాయి. నాణ్యత లేకుండా పురుగులు ఉన్న ఆహారాన్ని ఎలా తినాలంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఎన్నిసార్లు ఉపాధ్యాయులకు, అధికారులకు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్ తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు ఇలాంటి కలుషిత భోజనం ఎందుకు పెడుతున్నారని నిర్వాహకుల్ని ప్రశ్నించారు. దాంతో వారు బొద్దింక పడిన ఆహారం మీకు వడ్డించలేదని బదులిచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి శాశ్వత ఫుడ్ ఇన్స్పెక్టర్, తనిఖీల నిమిత్తం సిబ్బందిని ఏర్పాటు చేసి, మరొకసారి ఇలా జరగకుండా సంబంధిత కాంట్రాక్టర్‎పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!