AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సీఎం జగన్.. సభలు, సమావేశాలు ఎలా ప్లాన్ చేశారంటే..

ఏపీలో ఎన్నికల ప్రచారాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగం సిద్దం చేశారు. ఎన్నికల క్యాంపైన్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. దీంతో 2024 ఎన్నికల స్పీచ్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏపీలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే పొలిటికల్ హీట్ రాజుకున్న నేపథ్యంలో ఇక ప్రచార పర్వం త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే సిద్ధం సభల పేరుతో ప్రాంతాల వారీగా సభల్లో పాల్గొన్న ఆయన ఎన్నికల క్యాంపెయిన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు.

YSRCP: ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సీఎం జగన్.. సభలు, సమావేశాలు ఎలా ప్లాన్ చేశారంటే..
Ys Jagan
S Haseena
| Edited By: |

Updated on: Mar 11, 2024 | 5:21 PM

Share

ఏపీలో ఎన్నికల ప్రచారాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగం సిద్దం చేశారు. ఎన్నికల క్యాంపైన్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. దీంతో 2024 ఎన్నికల స్పీచ్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏపీలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే పొలిటికల్ హీట్ రాజుకున్న నేపథ్యంలో ఇక ప్రచార పర్వం త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే సిద్ధం సభల పేరుతో ప్రాంతాల వారీగా సభల్లో పాల్గొన్న ఆయన ఎన్నికల క్యాంపెయిన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్లో జోష్ నింపిన ఆయన తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే తన రోజువారి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచి విపక్షాలపై విమర్శల డోస్ పెంచి దూసుకెళ్ళనున్నారు. ఇక ఎన్నికల క్యాంపెయిన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు పర్యటించాలి. ఏ జిల్లాలో ఎప్పుడు పర్యటించాలి, సభలు ఎక్కడ నిర్వహించాలి, రోడ్ షోలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానికి సంబంధించి ప్లాన్ ఇప్పటికే ఖరారైంది.

ఈ నేపథ్యంలో ఓకే రోజు వేరు వేరు ప్రాంతాల్లో వేర్వేరు సభలు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తుంది వైసీపీ. ఏపీలో కీలకమైన నియోజకవర్గాలను టచ్ చేస్తూనే ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ప్రచారం ఉండేలాగా ప్లాన్ రూపొందిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 నియోజకవర్గాల్లో విజయ బావుటా ఎగురవేసిన వైసీపీ.. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో వై నాట్ 175 నినాదాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకొని వెళ్లబోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నమోదు చేసిన విజయాన్ని మరోసారి రిపీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రచారాన్ని ఉధృతం చేస్తూ రోడ్ షోలు, సభలతో విస్తృతంగా ప్రజలకు దగ్గర అయ్యేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఎన్నికల కోసం రోజుకు రెండు లేదా మూడు సభలు సమావేశాలతో పాటు రోడ్ షోలో పాల్గొనడంతో పాటు తాము గతంలో కైవసం చేసుకోలేకపోయిన నియోవర్గాలలో ఈసారి పాగా వేయాలని చూస్తుంది. ఈ ఎన్నికల వేదికగా వై నాట్ 175 నినాదాన్ని బలంగా తీసుకొని వెళ్లడంతో పాటు.. ఈ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, పొత్తులతో వస్తున్న విపక్షాల విధానాన్ని తూర్పారాపట్టబోతున్నారు వైఎస్ జగన్.

ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల నడుమున వైసిపి తరఫున ప్రచారంలో కొత్త పుంతలు తొక్కేలా జగన్ ప్రసంగం ఉండబోతోంది. తమ పర్యటనలో మ్యానిఫెస్టోను వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం ఉంది. నాడు-నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఇటీవల ప్రజల్లోకి తీసుకెళుతున్న వైసీపీ అధినేత.. అదే ఫార్ములాను మరోసారి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేలా స్పీచ్‎ను తయారు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి 2019 ఎన్నికల్లో తన స్పీచ్‎లతో ప్రజలకు చేరువైన జగన్.. ఈ ఎన్నికల ప్రచారంలో అంతే దూకుడుతో తన ప్రసంగాన్ని ఉండేలా చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో సమస్యలను ఎలివేట్ చేస్తూ అధికారంలోకి వచ్చి.. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేశామో వివరించనున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం ఏ రకంగా చుపామో అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లబోతున్నారు వైఎస్ జగన్. ఇక ప్రాంతాలవారీగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వెనుక బాటుతనం, ఉత్తరాంధ్రలో వలసలు, ఉద్దానం తాగునీటి సమస్యలు, మేనిఫెస్టో హామీల అమలు, సంక్షేమ పథకాలు, రైతాంగం, యువత మహిళల కోసం అమలు చేసిన సంస్కరణలను ప్రజలకు వివరించబోతున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలతో ఎన్నికల ప్రచారం ఉధృతం చేయబోతోన్నటు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us