Ramadan 2024: రేపటి నుంచి రంజాన్ దీక్షలు ప్రారంభం.. దేశంలో వివిధ నగరాల్లో సహర్, ఇఫ్తార్ సమయం వివరాలు ఇవే
సౌదీ అరేబియాలో ఈరోజు అంటే మార్చి 10న రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను మార్చి 11న ఆచరిస్తారు. భారతదేశం, పాకిస్తాన్లలో, సౌదీ అరేబియా చంద్రుని తర్వాత ఒక రోజు రంజాన్ చంద్రుడు కనిపిస్తాడు.. అందుకే ఈ దేశాలలో సౌదీ అరేబియా తర్వాత ఒక రోజు రంజాన్ ఉపవాసం ప్రారంభమవుతుంది. అంటే భారతదేశంలో మొదటి రోజా మార్చి 12 మంగళవారం నాడు జరుపుకుంటారు. రేపు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా రంజాన్ చంద్రుడు సౌదీ అరేబియాలో మొదటగా కనిపిస్తాడు. ఒక రోజు తర్వాత భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలలో ఒక రోజు తర్వాత కనిపిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర దేశాలలో చంద్రుడు ఒకే రోజున కనిపిస్తాడు. అయితే భారత దేశంలో రంజాన్ చంద్రుడు ఈ రోజు సాయంత్రం కనిపిస్తాడని.. దీంతో మార్చి 12 నుంచి రంజాన్ మొదటి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
సాధారణంగా సౌదీ అరేబియాలో చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత భారత్‌లో చంద్రుడు కనిపిస్తాడు. అందువల్ల, భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లలో తరచుగా రంజాన్ మొదటి ఉపవాసం సౌదీ అరేబియాలో మొదటి ఉపవాసం తర్వాత ఒక రోజు ప్రారంభమవుతుంది. చంద్రుని దర్శనం అయిన మరుసటి రోజు నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. అంటే మార్చి 11 సాయంత్రం నుంచి తరావీహ్ నిర్వహించబడుతుంది. మార్చి 12 న మొదటి రోజాను ఆచరిస్తారు.
సౌదీ అరేబియాలో రంజాన్ ప్రారంభమవుతుంది
సౌదీ అరేబియాలో ఈరోజు అంటే మార్చి 10న రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను మార్చి 11న ఆచరిస్తారు. భారతదేశం, పాకిస్తాన్లలో, సౌదీ అరేబియా చంద్రుని తర్వాత ఒక రోజు రంజాన్ చంద్రుడు కనిపిస్తాడు.. అందుకే ఈ దేశాలలో సౌదీ అరేబియా తర్వాత ఒక రోజు రంజాన్ ఉపవాసం ప్రారంభమవుతుంది. అంటే భారతదేశంలో మొదటి రోజా మార్చి 12 మంగళవారం నాడు జరుపుకుంటారు. రేపు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
నెల పాటు ఉపవాస దీక్ష
ముస్లింల అత్యంత పవిత్ర మాసం రంజాన్ ను ప్రతి ముస్లిం అత్యంత భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు. నియమ నిష్టలతో ఉపవాస దీక్షలను చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ కనీసం నీరు కూడా తాగరు. సరికదా నోట్లోని లాలా జలాన్ని కూడా మింగరు. అత్యంత కఠినంగా ఉపవాస దీక్షను చేస్తారు. భగవంతుడిని ప్రార్ధిస్తారు.
నమాజ్ చేసే సమయం
రంజాన్ ఉపవాసం చేస్తూనే రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ రోజులో ఐదు సార్లు నమాజ్ చేస్తారు. రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య సమయంలో అంటే సహర్ నుంచి ఇఫ్తార్ సమయం వరకూ రోజులో ఐదు సార్లు నమాజు చేస్తారు. తరావీహ్ నమాజులో రెండు సార్లు ఖురాన్ చదువుతారు. ఈ నెల రోజుల్లో సఫిల్ చదివితే ఫరజ్ చదివినంత పుణ్యమని ఇస్లాం గ్రంధాల్లో ఉంది. రంజాన్ మాసం ముగిసిన తరువాత, ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.
దేశంలో వివిధ నగరాల్లో సహర్ నుంచి ఇఫ్తార్ సమయం వివరాలు
- హైదరాబాద్: సహర్ 05:16 AM; ఇఫ్తార్: 06:26 PM
- ముంబై: సహర్ 05:38 AM; ఇఫ్తార్: 06:48 PM
- ఢిల్లీ: సహర్ 05:18 AM; ఇఫ్తార్: 06:27 PM
- పూణె: సహర్ 05:34 AM; ఇఫ్తార్: 06:44 PM
- చెన్నై: సహర్ 05:08 AM; ఇఫ్తార్: 06:20 PM
- బెంగళూరు: సహర్ 05:19 AM; ఇఫ్తార్: 06:31 PM
రంజాన్ నెలలో చేసే దానం
రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. ఈ మాసం 720 గంటలు అంటే నాలుగు వారాలు, రెండు రోజులు ఉంటుంది. ఈ సమయంలో ముస్లింలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. దీనిని దయ, ఆశీర్వాదాల నెల అని పిలుస్తారు. ఈ నెలలో ఎక్కువ సమయం ఆరాధనకు వెచ్చిస్తారు. ఈ నెలలో ఎక్కువగా దానం చేయడం వలన పుణ్యం అని నమ్మకం. ఏదేమైనప్పటికీ ఉపవాసం, తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని వీక్షణపై ఆధారపడి ఉంటుంది. కనుక రంజాన్ ప్రారంభం, ముగింపు నెల వంక వీక్షణపై ఆధారపడి ఉంటుంది.
రంజాన్ ఎందుకు ప్రత్యేకం?
ఇస్లాం మతంలో రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెల మొత్తం, ముస్లిం మతస్థులు రోజా అంటే ఉపవాసం ఉంటారు . ఎక్కువ సమయం అల్లాను ఆరాధించడంలో గడుపుతారు. ముస్లింలు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల చివరిలో ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు, దీనిని ఈద్ అని కూడా పిలుస్తారు. ముస్లిం విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నెలలో ప్రవక్త మహమ్మద్ సాహిబ్ 610వ సంవత్సరంలో లైలతుల్-ఖద్ర్ సందర్భంగా ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ షరీఫ్‌ను అందుకున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..