AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polavaram Project Updates: పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి.. కీలకమైన గ్యాప్3 నిర్మాణం పూర్తి..

Polavaram Project Updates: పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయి. కీలక నిర్మాణ పనులన్నీ ఒక్కొక్కటిగా త్వరగా పూర్తవుతున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టులో

Polavaram Project Updates: పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి.. కీలకమైన గ్యాప్3 నిర్మాణం పూర్తి..
Shiva Prajapati
|

Updated on: Sep 11, 2021 | 6:39 AM

Share

Polavaram Project Updates: పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయి. కీలక నిర్మాణ పనులన్నీ ఒక్కొక్కటిగా త్వరగా పూర్తవుతున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టులో ఎంతో కీలకమైన గ్యాప్ 3 నిర్మాణం పూర్తయ్యింది. పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గ్యాప్-3 కాంక్రీట్ పనులను పూర్తిశారు. మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ నిర్మాణ పనిని పూర్తి చేసింది. 153.50 మీటర్ల పొడవున, 53.320మీ ఎత్తున,8.50 మీ వెడల్పున గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేశారు. స్పిల్ వే నుండి ఈసిఆర్ఎఫ్ డ్యామ్ కు అనుసంధానం చేయడానికి గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణానికి దాదాపు 23,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. పోలవరం హెడ్ వర్క్స్‌లో 3 ఈసిఆర్ఎఫ్ డ్యామ్ లలో గ్యాప్-3 ఒకటి. గ్యాప్-1, గ్యాప్-2 ఈసిఆర్ఎఫ్ లు, రాక్ ఫిల్ డ్యామ్ లు కాగా.. గ్యాప్-3 మాత్రం కాంక్రీట్ డ్యామ్.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కోక్కటీ పూర్తి చేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఓవైపు వరదలు.. మరో వైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులున్నా లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. కాగా, గ్యాప్-3 నిర్మాణ పూర్తి సందర్భంగా పూజాకార్యక్రమంలో పాల్గొన్న ఇరిగేషన్ అడ్వైజర్ గిరిధర్ రెడ్డి, ఈఈలు పాండురంగారావు, మల్లిఖార్జునరావు, ఆదిరెడ్డి, డిఈఈ ఎమ్.కె.డి.వి ప్రసాద్, ఎఈఈ శ్రీధర్, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ఎం. ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, ఎజీఎంలు కె.రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, మేనేజర్ మురళి, తదితరులు పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు వర్క్ ప్రోగ్రెస్.. మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2019 నవంబర్‌లో ప్రాజెక్టు పనులను చేపట్టింది. ఇప్పటికే కీలకమైన పోలవరం స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తైంది. స్పిల్ వే లో 3,32,295 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా స్పిల్ వేలో అమర్చాల్సిన 48 రేడియల్ గేట్లకు గానూ 42 గేట్లను అమర్చింది. మిగిలిన 6 గేట్లను కూడా త్వరలోనే అమర్చనున్నారు. రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు గానూ 84 సిలిండర్లను అమర్చారు. ఇప్పటికే 24 పవర్ ప్యాక్ లకు గానూ 24 పవర్ ప్యాక్ లు అమర్చారు. కాగా, ఇప్పటికే అన్ని గేట్లను పైకి ఎత్తి ఉంచడంతో గేట్ల ఏర్పాటు తర్వాత మొదటి సారి అన్ని గేట్ల నుండి గోదావరి వరద దిగువకు ప్రవహిస్తోంది. అదేవిధంగా 10 రివర్ స్లూయిజ్ గేట్లను అమర్చడంతో పాటు వాటిని ఇప్పటికే పైకి ఎత్తి నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. స్పిల్ ఛానెల్‌లో 2,41,826 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదే విధంగా స్పిల్ ఛానెల్‌లో 35లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. దీనికి తోడు స్పిల్ ఛానెల్ లో కీలకమైన 1,391 మీటర్ల పొడవైన ఎండ్ కటాఫ్ వాల్ నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి.

ఇక అప్రోఛ్ ఛానెల్ లో దాదాపు 70లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఇది కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం. కీలకమైన ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యామ్‌లో 33,73,854, క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి. ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యామ్‌ను 2,480 మీటర్ల పొడవున, 42.5 మీటర్ల ఎత్తుకు గానూ పూర్తిస్థాయి ఎత్తున నిర్మాణం పూర్తయింది. దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం సైతం దాదాపు 21మీటర్ల ఎత్తులో పూర్తయింది. దిగువ కాఫర్ డ్యామ్ లో ఇప్పటికే 3,15,237 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. ఇటీవలే ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర అడ్డుకట్ట వేసి గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్ళించడం పూర్తైంది. ఇలా అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా గోదావరి నదిని దాదాపు 6.6 కిలోమీటర్లు మళ్ళించడం జరిగింది.

ఇప్పటికే గ్యాప్-2 లో ఈసిఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఇక గ్యాప్-1లో 400మీటర్ల పొడవున ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. గ్యాప్-1లో నేలను గట్టి పరిచేందుకు స్టోన్ కాలమ్స్ పనులు పూర్తి అవ్వగా, కీలకమైన డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆసియాలో మొదటిసారి ఆధునిక టెక్నాలజీతో గ్యాప్-1లో డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఇంకా కీలకమైన జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే 20,31491 క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు పూర్తయ్యాయి. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు జోరందుకున్నాయి.

Also read:

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. ఎంఎన్ఎంకే పార్టీ ముఖ్య నేత దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి..

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..

Silver Price Today: పసిడి బాటలో వెండి.. పరుగులు పెడుతున్న సిల్వర్‌ ధర.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..