Mangalagiri : మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష

ఆరోగ్య సంరక్షణ, సేవల రంగంలో డ్రోన్ టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించాలనే లక్ష్యంతో.. కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మొత్తం 11 ఎయిమ్స్‌లలో డ్రోన్ సేవలను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు.

Mangalagiri : మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష
AIIMS Mangalagiri
Follow us

|

Updated on: Oct 29, 2024 | 4:53 PM

టెక్నాలజీ రోజురోజుకు ఓ రేంజ్‌లో అప్‌డేట్ అవుతుంది. సాంకేతికత కొత్త రూపు సంతరించుకుంటుంది. తాజాగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రేంజ్ అప్‌గ్రేడేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టెక్నాలజీని హెల్త్ సెక్టార్‌లో కూడా మిక్స్ చేసి.. అద్భుతాలు చేయాలని కేంద్రం ప్రణాళికలు పెట్టుుకుని ముందుకు వెళ్తుంది.

తాజాగా మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఎయిమ్స్‌ వైద్యులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష నిర్వహించారు. దానిలో భాగంగా.. ఎయిమ్స్‌ నుంచి నూతక్కి పీహెచ్‌సీ వరకూ డ్రోన్‌ను ప్రయోగించారు. ఓ మహిళా రోగి నుంచి బ్లెడ్ శాంపిల్ సేకరించిన డ్రోన్‌.. అక్కడి నుంచి ఎయిమ్స్‌కు తిరిగొచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ నుంచి నూతక్కి ఈ ప్రాథమిక వైద్య కేంద్రం దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల ఉపయోగంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు మంగళగిరి డాక్టర్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు, రక్త సేకరణ వంటి సేవల్లో డ్రోన్ల వినియోగం మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు ఎయిమ్స్‌ వైద్యులు. మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సమర్థవంతమైన వైద్య సేవలను అందించడంలో సాంకేతికతను ఉపయోగించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..