Kapil Dev – Chandrababu: ఏపీ సీఎంతో కపిల్ దేవ్ భేటీ.. ఆ ప్రాజెక్ట్‌పై కీలక చర్చలు?

Kapil Dev Meets CM Chandrababu Naidu: అమరావతి, వైజాగ్‌లలో కొత్త స్టేడియాల నిర్మాణం కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకుగాను క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. అలాగే, అమరావతితో ఓ గోల్ఫ్ కోర్ట్‌ను కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.

Kapil Dev - Chandrababu: ఏపీ సీఎంతో కపిల్ దేవ్ భేటీ.. ఆ ప్రాజెక్ట్‌పై కీలక చర్చలు?
Kapil Dev Meets Ap Cm Chandrababu Naidu
Follow us

|

Updated on: Oct 29, 2024 | 6:00 PM

Kapil Dev Meets CM Chandrababu Naidu: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహా స్థానిక లీడర్లు ఘన స్వాగతం పలికారు. కాగా, కపిల్ దేవ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విస్తృత కార్యక్రమాల గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

సోమవారం రాత్రి విజయవాడకు చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, మంగళవారం సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. కాగా, ప్రస్తుతం విశాఖపట్నంలో ముడసర్లోవలో ఓ గోల్ప్ కోర్టు ఉందనే సంగతి తెలిసిందే. అమరావతిలో మరో గోల్ప్ కోర్ట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబు హయంలోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఎన్నికలు రావడం, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. జగన్ ప్రభుత్వంలో ఈ గోల్ఫ్ కోర్ట్ ప్రాజెక్టుకు నిధులు కేటాయిచలేదు. దీంతో మరోసారి చంద్రబాబు సీఎం కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..