AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌ జాతికి అంకితం..

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 1) ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌ జాతికి అంకితం..
Pm Modi Inaugurated Airport
Balaraju Goud
|

Updated on: Aug 01, 2026 | 11:48 AM

Share

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 1) ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

సుమారు రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనాన్ని సందర్శించి అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, ప్రయాణికుల సదుపాయాలు, విమానాశ్రయ నిర్మాణ ప్రత్యేకతలు, ఆధునిక సాంకేతిక వ్యవస్థల గురించి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. అలాగే ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా మోదీ ఆసక్తిగా పరిశీలించారు.

ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో గిరిజన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ థింసా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది కళాకారులు ప్రదర్శించిన ఈ నృత్యాన్ని వీక్షించిన ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. టెర్మినల్ ప్రారంభం అనంతరం ప్రధానమంత్రి మోదీ రూ.17,912 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఓపెన్‌టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us