AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆ ఇంట్లో వినియోగించని బాత్రూం ఓపెన్ చేసిన పోలీసులు షాక్…

గతంలో ప్యాక్షన్ నడిచేటప్పుడు పల్నాడు పల్లెల్లో గంపల కొద్దీ నాటు బాంబులు దొరికేవి... అయితే ఇవి తయారు చేయడానికి ప్రత్యేకంగా మనుషులు ఉండేవారు. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో నాటు బాంబుల తయారీకి పుల్ స్టాప్ పడింది. గత రెండు ఎన్నికల్లోనూ నాటు బాంబులు ఎక్కడా పేలలేదు.. కానీ...

AP News: ఆ ఇంట్లో వినియోగించని బాత్రూం ఓపెన్ చేసిన పోలీసులు షాక్...
Petrol Bombs
T Nagaraju
| Edited By: |

Updated on: May 16, 2024 | 6:14 PM

Share

2024 ఎన్నికల్లో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పల్నాడు ప్రాంతంలో అధికంగా ఘర్షణలు జరిగాయి. దీంతో గత మూడు రోజుల నుండి పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పల్నాడులో ఎప్పుడు లేనంతగా స్థానికులను కలవర పెడుతున్న అంశం పెట్రోల్ బాంబులు… గతంలో ప్యాక్షన్ నడిచేటప్పుడు పల్నాడు పల్లెల్లో గంపల కొద్దీ నాటు బాంబులు దొరికేవి… అయితే ఇవి తయారు చేయడానికి ప్రత్యేకంగా మనుషులు ఉండేవారు. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో నాటు బాంబుల తయారీకి పుల్ స్టాప్ పడింది. గత రెండు ఎన్నికల్లోనూ నాటు బాంబులు ఎక్కడా పేలలేదు..

అటువంటి పరిస్థితే తిరిగి ఈ ఎన్నికల్లోనూ ఉంటుందని పల్నాడు వాసులు భావించారు. ఘర్షణలు చోటు చేసకుంటాయన్న ముందస్తు సమాచారం పోలీసులకు ఉన్నా బాంబులు మాత్రం ఉండవని అందరూ అనుకున్నారు. అయితే నాటు బాంబులు స్థానంలోనే పెట్రోల్ బాంబులు తెరపైకి రావడంతో అటు పోలీసులు ఇటు స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

దాచేపల్లి మండలం తంగెడలో పోలింగ్ ముగిసిన వెంటనే వైసిపి టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో పెట్రోల్ బాంబులు కూడా విసురుకున్నారు. దీంతో అనేక వాహనాలు కూడా తగలబడ్డాయి. అప్పడే పెట్రోల్ బాంబుల విధ్వంసం కూడా బయటపడింది. అయితే ఇక ఎక్కడా కూడా పెట్రోల్ బాంబులు ఉండవని అందరూ అనుకున్నారు.

ఎన్నికల ముగిసిన మూడు రోజుల తర్వాత పోలీసులు సమస్యాత్మకంగా గ్రామాల్లో విసృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సోదాల్లో పెద్ద సంఖ్యలో పెట్రోల్ బాంబులు బయడపడటంతో స్థానికులు ఉలిక్కి పడుతున్నారు. మాచవరం మండలం పిన్నెల్లిలో పలువురు ఇళ్లలో ట్రేల్లో సర్ధి పెట్టుకున్న పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసకున్నారు.

ముప్పాళ్ల మండలం మాదలలో కూడా పెట్రోల్ బాంబులు బయట పడ్డాయి. ఓ ఇంట్లోని బాత్ రూంలో దాచి ఉంచిన 29 పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇంకా అనేక చోట్ల పెట్రోల్ బాంబులు ఉంటాయన్న చర్చ పల్నాడు పల్లెల్లో మొదలైంది. రానున్న రోజుల్లో అన్ని సమస్యాత్మక గ్రామాల్లో సోదాలు చేయాలన్న డిమాండ్స్ వినపడుతున్నాయి. పెట్రలో బాంబులు తయారు చేస్తున్నా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..