AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పన్ను కట్టండి.. వెండి నాణేలు గెలవండి…

పన్ను బకాయిల వసూళ్లను పెంచేందుకు ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం చందలూరు గ్రామ పంచాయతీ వినూత్న ఆఫర్ ప్రకటించింది. మార్చి 15, 2026 లోపు ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలను చెల్లించిన వారికి లక్కీ డ్రా నిర్వహించనున్నారు. డ్రాలో ఎంపికైన మొదటి ముగ్గురు విజేతలకు...

Andhra: పన్ను కట్టండి.. వెండి నాణేలు గెలవండి...
Chandaluru Panchayat
Fairoz Baig
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 1:21 PM

Share

పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. సకాలంలో ఇంటి పన్ను కడితే 10 గ్రాముల వెండి కాయిన్స్ సొంతం చేసుకునే అవకాశం… ఇదేదో వినూత్నంగా ఉంది కదూ… సాధారణంగా షాపింగ్‌ మాల్స్‌, ఇతర వాణిజ్య ఉపకరణాల దుకాణదారులు తమ దగ్గర వస్తువులు కొంటే బంపర్‌ డ్రా తీసి విలువైన బహుమతులు అందిస్తామంటూ ప్రకటనలు చేస్తుంటారు. అయితే ఓ పంచాయతీ అధికారులు పేరుకుపోయిన పన్నులు వసూలు చేసేందుకు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించండి, లక్కీ డ్రాలో వెండి నాణేలు తీసుకెళ్ళండంటూ వినూత్నంగా వసూళ్ళ సాధన కోసం ప్రచారం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం చందలూరు గ్రామ పంచాయతీ పన్ను వసూళ్లలో వేగం పెంచేందుకు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. పెండింగ్‌లో ఉన్న పన్నులను త్వరగా వసూలు చేసేందుకు ప్రజలకు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి గానూ పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్ను నీటి పన్ను బకాయిలను మార్చి 15, 2026 లోపు చెల్లించిన వారు ఈ లక్కీ డ్రాకు అర్హులుగా ఎంపిక చేస్తామని చెబుతున్నారు… సకాలంలో పన్నులు, బకాయిలు చెల్లించిన వారికి లక్కీ డ్రా నిర్వహిస్తారు… లక్కీ డ్రా ద్వారా ఎంపికైన మొదటి ముగ్గురు విజేతలకు తల 10 గ్రాముల చొప్పున వెండి నాణేలను బహుమతిగా అందజేయనున్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామ సర్పంచ్ కోరుతున్నారు.

Follow Us