AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆయన హిందూ.. ఆశ్రమం నడిపేది క్రిస్టియన్స్.. అంత్యక్రియలు చేసింది ముస్లింలు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సిద్ధన్న వృద్ధాప్యంలో ప్రశాంతి వృద్ధాశ్రమంలో నివసిస్తూ ఉండగా అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణించిన విషయం తెలియజేసి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వృద్ధాశ్రమ నిర్వాహకులు ఫోన్ చేసినా, ఇద్దరు కుమార్తెలు రావడం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం.

Andhra: ఆయన హిందూ.. ఆశ్రమం నడిపేది క్రిస్టియన్స్.. అంత్యక్రియలు చేసింది ముస్లింలు
Daughters Skip Father Funeral
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 1:34 PM

Share

తల్లి నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనిస్తే… తండ్రి జీవితాంతం కష్టపడి వారిని పెంచి పెద్ద చేస్తాడు. అలాంటి తండ్రి వృద్ధాప్యంలో బిడ్డలా మారి తన పిల్లలపై ఆధారపడాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ పిల్లలే తల్లిదండ్రులను మరిచిపోతున్నారు. అలాంటి హృదయ విదారక ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సిద్ధన్న వృద్ధాప్యంలో హిందూపురం సమీపంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ జీవిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ, వృద్ధాశ్రమంలోనే రోజులు గడుపుతున్నాడు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధన్న అక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆయన కుమార్తెలకు ఫోన్ ద్వారా తెలియజేసి, వచ్చి తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరు కుమార్తెలు తాము రావడం సాధ్యం కాదని, వృద్ధాశ్రమ నిర్వాహకులే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

ఎంత ప్రయత్నించినా కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో, వృద్ధాశ్రమ నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిసి సిద్ధన్నకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృతదేహం, అంత్యక్రియల ఫోటోలను కూడా ఆయన కుమార్తెలకు పంపినట్లు వృద్ధాశ్రమ నిర్వాహకులు తెలిపారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పిల్లలు చూసుకోవడం, ఆఖరికి వారు చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించడం సహజం. కానీ ఈ ఘటనలో కుమార్తెలు కూడా రాకపోవడం వృద్ధాశ్రమంలోని వారిని తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది.

Follow Us
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కూడా కూతుర్లు రాని వేళ...
తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కూడా కూతుర్లు రాని వేళ...
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
హిస్టరీ మార్చిన ఐదుగురు తోపులు.. లిస్ట్ చూస్తే ప్రత్యర్థులకు షాకే
హిస్టరీ మార్చిన ఐదుగురు తోపులు.. లిస్ట్ చూస్తే ప్రత్యర్థులకు షాకే
బీట్‌రూట్ రైతా.. వేసవి కోసం సూపర్ కూల్ డెలైట్..!
బీట్‌రూట్ రైతా.. వేసవి కోసం సూపర్ కూల్ డెలైట్..!
సూపర్‌ ప్లాన్‌.. కేవలం రూ.485 రీఛార్జ్‌తో 72 రోజుల వ్యాలిడిటీ
సూపర్‌ ప్లాన్‌.. కేవలం రూ.485 రీఛార్జ్‌తో 72 రోజుల వ్యాలిడిటీ
పన్ను కడితే.. వెండి నాణేలు గెలుచుకునే అవకాశం..
పన్ను కడితే.. వెండి నాణేలు గెలుచుకునే అవకాశం..
బ్లూటూత్‌, Wi-Fi ఆన్‌లో ఉంటే మొబైల్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా?
బ్లూటూత్‌, Wi-Fi ఆన్‌లో ఉంటే మొబైల్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా?
ఏసీ, కూలర్‌తో పనే లేదు..ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్లగా కూల్ కూల్‌గా
ఏసీ, కూలర్‌తో పనే లేదు..ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్లగా కూల్ కూల్‌గా
వెనక్కి నడవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు.. తెలుసుకుంటే షాక్..
వెనక్కి నడవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు.. తెలుసుకుంటే షాక్..