Renu Desai: పవన్ కల్యాణ్ క్యారెక్టర్ అదీ.. సంచలన వీడియో రిలీజ్ చేసిన రేణు దేశాయ్..

Renu Desai on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుపోతున్నాయి. ఈ తరుణంలో రాజకీయాలతోపాటే.. వ్యక్తిగత విమర్శలు.. అంతటితో ఆగకుండా సినిమాలు వరకు వెళ్లింది. పర్సనల్ లైఫ్.. పొలిటికల్‌ లైఫ్ రెండూ వేర్వేరు అంశాలు..

Renu Desai: పవన్ కల్యాణ్ క్యారెక్టర్ అదీ.. సంచలన వీడియో రిలీజ్ చేసిన రేణు దేశాయ్..
Renu Desai On Pawan Kalyan
Follow us

|

Updated on: Aug 10, 2023 | 6:05 PM

Renu Desai on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుపోతున్నాయి. ఈ తరుణంలో రాజకీయాలతోపాటే.. వ్యక్తిగత విమర్శలు.. అంతటితో ఆగకుండా సినిమాలు వరకు వెళ్లింది. పర్సనల్ లైఫ్.. పొలిటికల్‌ లైఫ్ రెండూ వేర్వేరు అంశాలు.. కానీ.. ఏపీ రాజకీయాలు మాత్రం పర్సనల్‌ విషయాలు చుట్టూ తిరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపు తిరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ వైఫ్‌ రేణూ దేశాయ్‌ వీడియో విడుదల చేసి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి తనను, తన పిల్లలను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. తన మాజీ భర్త, తనకు సంబంధించిన అంశాలతో సినిమా, ఓటీటీ సీరిస్‌లు తీస్తామంటున్నారని.. అది కరెక్ట్ కాదంటూ సూచించారు. రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ పిల్లలను, మహిళలను లాగకండి అంటూ పేర్కొన్నారు. తన పిల్లలే కాదు, ఏ రాజకీయ నాయకుడి పిల్లలను లాగడం మంచిది కాదంటూ సూచించారు. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు.. పవన్‌ కల్యాణ్‌ డబ్బు మనిషి కాదు.. నా వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకురావొద్దంటూ సూచించారు. అంతటితో ఆగకుండా రేణు దేశాయ్‌ పవన్‌ కల్యాణ్ పై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన విషయంలో మాజీ భర్త (పవన్‌) చేసింది ముమ్మాటికి తప్పేనని.. కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావొద్దని రేణుదేశాయ్‌ సూచించారు.

ఈ మేరకు రేణు దేశాయ్ ఇన్ స్టా వేదికగా వీడియోను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ఆశయాలు గొప్పవి.. పవన్ డబ్బు మనిషి కాదు.. పవన్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజల కోసం పవన్ పనిచేయాలన్న తపన గొప్పది.. అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రేణు దేశాయ్ ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

కాగా.. రేణు దేశాయ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..