Kakinada: సముద్రంలో ఛేజింగ్ సీన్.. కాకినాడలో సింగం-2 సీన్ రిపీట్
- సముద్రంలో ఛేజింగ్ సీన్.. సింహం-2 సినిమా చూశారు కదా. ఆ సినిమాలో హీరో సూర్య సముద్రంలో విలన్ల బోట్లను వెంబడించిన సీన్ ఆ సినిమాకే హైలెట్.. కాకినాడలో రియల్‌గానే ఆ సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఇక్కడ వెంబడించింది పోలీస్ సింహం కాదు.. కలెక్టర్ సింహం.
పైన వీడియోలో మీరు చూస్తున్న షిప్పులో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారు అక్రమార్కులు. ఈ ఓడలో 5కంటైనర్లు ఉన్నాయి. కంటైనర్లలో మొత్తం 38 వేల టన్నుల బియ్యం రవాణా చేస్తున్నారు. ఇందులో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.
షిప్పులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరిస్తున్నారన్న సమాచారం అందుకున్న కలెక్టర్, రెవెన్యూ అధికారులతో కలిసి యాంకరేజ్ పోర్ట్‌కు వెళ్లారు. అక్కడ కస్టమ్స్ అధికారులతో కలిసి స్టెల డెల్ షిప్పులో బియ్యాన్ని తరలిస్తోన్న ఓడను వెంబడించారు. సినీఫక్కీలో సముద్రంలో ఛేజింగ్ చేశారు. ఓడను సముద్రంలోనే అడ్డగించి తనిఖీలు చేశారు. స్పాట్ లోనే కెమికల్స్‌తో టెస్ట్ చేసి 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆ షిప్పును గొలుసులతో కస్టమ్స్ అధికారుల బోట్‌లకు జతచేసి పోర్ట్‌కు తీసుకొచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..