AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా..? పవన్-మోదీ భేటీ దేనికి సంకేతం..?

ప్రధాని మోదీ టూర్‌తో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా..? రాష్ట్రంలో జరుగుతున్న అనేక రాజకీయ విషయాలపై మోదీ ఫోకస్‌ పెట్టనున్నారా.. వీరి సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు. పవన్‌ బీజేపీకి మరింత దగ్గరవుతారా.. టీడీపీకి వ్యూహాత్మకంగా జనసేన అధినేత దూరమవుతారా.. లేక..మోదీతో చెడిన చంద్రబాబు స్నేహానికి..ఆయింట్‌మెంట్‌ పూసి..ఇద్దరినీ కలిపేసి..2024 పొలిటికల్‌ బరిలో కీలక పాత్ర పోషిస్తారా.. అసలు పవన్‌కు మోదీ రోడ్‌ మ్యాప్‌ ఇస్తారా..

AP Politics: ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా..?  పవన్-మోదీ భేటీ దేనికి సంకేతం..?
Pawan Kalyan - PM Modi
Ram Naramaneni
|

Updated on: Nov 11, 2022 | 8:16 AM

Share

నాకు రోడ్‌మ్యాప్‌ ఇవ్వండి మహాప్రభో అని ఎప్పటి నుంచో జనసేన అధినేత బీజేపీ పెద్దలను అడుగుతూనే ఉన్నారు. వాళ్లు కూడా ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని దాటవేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానే ఏపీకి వస్తున్నారు. దీంతో మళ్లీ పవన్‌ కల్యాణ్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మోదీ రెండ్రోజుల ఏపీ టూర్‌లో తనకు పది నిమిషాలు కలిసే అవకాశం రావడంతో.. ఈ భేటీలో..తన మనసులో ఉన్నవన్నీ కుండ బద్ధలు కొట్టాలనుకున్నారట. మరి మోదీ అంత అవకాశం ఇస్తారా..లేదంటే..అతిథిగా ఆహ్వానించి..కుశల ప్రశ్నలతోనే మమ అనిపిస్తారా అన్నది తేలాలి..కానీ ఈ భేటీ మాత్రం.. ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందని.. జనసేన నేతలు భావిస్తున్నారు. టీడీపీ అధినేత కూడా..మోదీ పవన్‌ సమావేశంపై ఒకింత ఆశతో మిణుకుమిణుకుమని చూస్తున్నట్లు తెలుస్తోంది..

ఏపీ బీజేపీ నేతలు మాత్రం పవన్‌ తమతోనే కలుస్తారని దండోరా వేస్తున్నారు.. పవన్‌ మాత్రం రోడ్‌ మ్యాప్‌ అడిగితే ఇవ్వడం లేదని..వాళ్లముందు తానెందుకు తగ్గాలని అంటున్నారు. ఈ మనస్పర్థలకు మోదీ మందు పూస్తారా..పవన్‌ను అక్కున చేర్చుకుంటారా..ఏపీ రాజకీయ పరిస్థితులను బట్టి..బీజేపీకి కూడా బూస్ట్‌ కావాలి కాబట్టి..జనసేన అధినేతతో కలిసి నడవాలని మోదీ భావిస్తారా.. అదే జరిగితే..ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు సడెన్‌గా ఛేంజ్‌ అవ్వడం ఖాయమే..ఇదే జరగాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్‌ ఏంటంటే.. ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో టీడీపీ కంటే జనసేనే కాస్త రేటింగ్‌లో ఉంది. విశాఖ ఎపిసోడ్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ జూలు విదిల్చారా అన్నట్లుగా దూకుడుమీదున్నారు. ఇక ఇప్పటం సీన్‌లో కూడా టీడీపీ కంటే జనసేనే మైలేజ్‌ ఎక్కువగా తెచ్చుకుంది.. వీటిన్నింటి దృష్ట్యా.. మోదీ..పవన్‌ కల్యాణ్‌తో ఏం మాట్లాడుతారోనన్నదానిపైనే..ఏపీ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు మూడేళ్ల తర్వాత మోదీ పవన్‌ కలవబోతున్నారు.

జనసేనతో బీజేపీ కలిస్తే..ఏపీ ముఖ్యమంత్రి జగన్‌..రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది కూడా మెయిన్‌ పాయింట్‌..ప్రస్తుతానికి జగన్‌ను ఏపీ బీజేపీ నేతలు..ప్రతి అంశంలోనూ టార్గెట్‌ చేస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం జగన్‌తో సఖ్యతగానే ఉంటోంది. ఈ విషయంలో ఏపీ కమలనాథులు పలుసార్లు తీవ్ర మనస్తాపానికి గురైనా చేసేదేమీ లేక సైలెంటయ్యారు. సోము వీర్రాజు భావిస్తున్నట్లు.. జనసేనతో బీజేపీ కలిస్తే మాత్రం..మోదీతో జగన్‌ దోస్తీపై నీలినీడలు కమ్ముకుంటాయా..వచ్చే ఎన్నికల్లో పొలిటికల్‌ సీన్‌ మారుతుందా.. పవన్‌కు మోదీ రోడ్‌ మ్యాప్‌ ఇస్తే.. జగన్‌ పొలిటికల్‌ ప్లాన్‌ కూడా కచ్చితంగా మారాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు వైసీపీ పెద్దల మెదళ్లను తొలుస్తున్నట్లు సమాచారం. కానీ పరిస్థితి అంతవరకు రాదని..తమ అధినేతకు మోదీతో మంచి సంబంధాలే ఉన్నాయని కూడా తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. చూద్దాం..మోదీ పవన్‌ కలయిక టీ కప్పులో తుఫాను అవుతుందా.. తీరంలో సునామీ రేపుతుందా అన్నది..భేటీ తర్వాత జరిగే పరిణామాలను బట్టి అంచనా వేసుకోవాల్సిందే..

మొదట్లో చంద్రబాబుతో చెలిమి చేసిన మోదీకి.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గించడానికి జనసేన అధినేత ఓ మధ్యవర్తిలా వ్యవహారం నడపనున్నారా.. వారి మధ్య నెలకొన్న రాజకీయ మనస్పర్ధలను తొలగించి..పాత స్నేహం చిగురించేలా..పరిస్థితిని చక్కబెడతారా..టోటల్‌గా బీజేపీ..టీడీపీ మధ్య దూరాన్ని తగ్గిస్తారా..బాబు కూడా లోలోపల ఇదే కోరుకుంటున్నారా..అందుకే..వ్యూహాత్మకంగా..మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌ చెప్పు చూపిస్తూ ఆవేశంగా మాట్లాడిన తర్వాత..అదేపనిగా ఆయన బస చేసిన హోటల్‌ వెళ్లి కలిసిన చంద్రబాబు..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తామిద్దరం కలుస్తామని చెప్పారు. దీని వెనుక గూడార్థం చాలా ఉన్నట్లు..ఆ క్షణమే ఏపీ పొలిటికల్‌ పెద్దలకు అర్థమైంది. కాకపోతే దేనికైనా సమయం, సందర్భం రావాలి కాబట్టి.. ఎంతవారలైనా అనుకూల సమయం వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. ఇలాంటి విషయాల్లో అపర చాణక్యత ప్రదర్శించే బాబు.. ఇప్పుడు పవన్‌ ద్వారా మోదీకి మళ్లీ దగ్గరవడానికి పాచిక వేశారని కూడా రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బాబు అనుకున్నదే జరిగితే.. పవన్‌ వల్ల బీజేపీతో టీడీపీ కలిసే పరిస్థితే వస్తే..జగన్‌ రాజకీయ వ్యూహం మరోలా ఉంటుందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇంకో మతలబు కూడా ఉంది..బాబును మోదీకి దగ్గరచేయడానికి పవన్‌ ఎంత కసరత్తు చేసినా..తనకంటే క్లోజ్‌ అవ్వడానికి ఆయన కూడా ఒప్పుకోరని..కాకపోతే..ఏదో ఉడతా సాయంగా..ఇద్దరి మధ్య చెలిమికి ప్రయత్నిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అట్‌ ద సేమ్‌ టైమ్‌..పవన్‌ బీజేపీకి దగ్గరయ్యాక..ఆటోమేటిక్‌గా టీడీపీకి దూరమవుతారని కూడా పొలిటికల్‌ సర్కిల్‌ అనుకుంటోంది..చూద్దాం..పదినిమిషాల భేటీ ఏ మార్పునకు శ్రీకారం చుడుతుందో..

మరిన్ని ఏపీ వార్తల కోసం..