Fire Accident: గోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..పెరుగుతున్న మృతుల సంఖ్య..
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయాడు. 80 శాతం గాయాలపాలైన మరొకరిని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని..

పశ్చిమ గోదావరి జిల్లా కడియం గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో ముగ్గురు ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయాడు. 80 శాతం గాయాలపాలైన మరొకరిని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని రాజంచెరువు సమీపంలో ఉన్నఈ కేంద్రంలో బాణసంచాను ఓ వాహనంలోకి లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ప్రమాద సమయంలో ఒక మహిళ వంట చేసుకోవడానికి ఇంటికి వెళ్లింది.. అలాగే మరొక వ్యక్తి టిఫిన్ తేవడానికి బయటకు వెళ్లడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల శరీర భాగాలు తునాతునకలై చెల్లాచెదురయ్యాయి.
వీరి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలపాలైనవారు కొత్తపల్లి గ్రామానికి చెందిన యాళ్ల ప్రసాద్, అనంతపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి సోలోమన్ రాజులుగా గుర్తించారు. ఈ ఇద్దరినీ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే యాళ్ల ప్రసాద్ చనిపోయాడు. సోలోమన్‌రాజు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరానికి తరలించారు.
తాడేసల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని అనంతపల్లి, జగ్గన్నపేట, అల్లంపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఈ బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడానికి వస్తుంటారు. తయారీ కేంద్ర నిర్వాహకుడు అన్నవరం ఘటన తరువాత పరారయ్యాడు.15కేజీల తయారీకి పర్మిషన్ ఉంటే…100 కేజీల బాణాసంచా తయారు చేయిస్తున్నారు అన్నవరం..అంతేకాదు ఆర్డర్లు ఎక్కువ కావడంతో కరెంట్ లేకున్నా, నిబంధనలు తుంగలోకి తొక్కి పనులు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ బాణాసంచా తయారీకి పర్మిషన్ ఉన్నట్టు తెలుస్తోంది..కానీ రూల్స్ ఏ మాత్రం పాటించలేదని స్ధానికులు చెబుతున్నారు. అంతేకాదు భారీగా ఆర్డర్లు రావడంతో హడావిడిగా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పరిమితికి మించి ఇంట్లో బాణా సంచా నిల్వ ఉంచాడు అన్నవరం..జరగకూడదని ఏమైనా జరిగితే…ఇంట్లో ఉన్న భారీ బాణాసంచా పేలితే ఏంటి పరిస్ధితి అని గ్రామస్తులు వాపోతున్నారు.
బాణసంచా పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మరణించిన వారి కుటుంబాలకు 10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని జగన్ ఆదేశించారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం
