Pawan Kalyan: ఇదేం పని.. రోడ్లపై చెట్లు నరికివేయడంపై సీరియస్ అయిన పవన్ కల్యాణ్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రోడ్లపై విచక్షణారహితంగా చెట్లు నరికేయిస్తున్నారని మండిపడ్డారు. నీడతో పాటు ఆహారాన్ని అందించే చెట్లను రక్షించనప్పుడు ఆ కర్మ కేవంల రాష్ట్ర సీఎంకే కాదు.. పరిపాలనలో భాగస్వాములైన అందరికీ పట్టుకుంటుందని ఆరోపించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రోడ్లపై విచక్షణారహితంగా చెట్లు నరికేయిస్తున్నారని మండిపడ్డారు. నీడతో పాటు ఆహారాన్ని అందించే చెట్లను రక్షించనప్పుడు ఆ కర్మ కేవంల రాష్ట్ర సీఎంకే కాదు.. పరిపాలనలో భాగస్వాములైన అందరికీ పట్టుకుంటుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనల నేపథ్యంలో చెట్ల నరికివేతపై పవన్ ట్విట్టర్‌లో స్పందించారు. ముఖ్యమంత్రి పర్యటనల సమయంలో చెట్ల నరికివేత విచిత్రంగా కనిపిస్తోందని అన్నారు. జంధ్యాల పాపయ్యశాస్తి రచించిన పుష్పవిలాపం చదవనప్పుడు.. ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ చేసిన ప్రయోగాలు అర్థం కాకపోతే వృక్షాలను, మొక్కలను నరికిస్తుంటే వచ్చే బాధ వాళ్లకెలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు.
అందుకే ఈ వృక్షాల నరికివేత యథేచ్చగా సాగిపోతుందని విమర్శించారు. అలాగే కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని.. అలాంటి కొబ్బరి చెట్లను కూడా నిలువునా నరికేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అమలాపురం పర్యటనకు వెళ్తున్నారని అక్కడి చెట్లను ఇలా నరికేశారని అన్నారు. తమిళనాట చెట్టును కటుంభ సభ్యుడిగా భావించి చూసుకుంటారని.. ఈ రాష్ట్రంలో ఆస్తులు పోగుచేసుకునేవారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటూ సూచనలు చేశారు. చెట్లను నరికేయవద్దని ముఖ్యమంత్రి కాకపోతే కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా సంబంధిత అధికారులకు సూచించాలని అన్నారు.