Ivy Gourd: భారీగా తగ్గిన ‘కూరగాయ’ ధరలు.. 2 రూపాయలకే కిలో.. తమను ఆదుకోవాలంటూ రైతుల ఆందోళన..
పశ్చిమ గోదావరి న్యూస్, జూలై 25: ఓ వైపు మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోతుంటే.. దొండకాయ ధరలు మాత్రం అమాంతం పడిపోయాయి. పశ్చిమగోదావరి ఖండవల్లి మార్కెట్లో కేజీ దొండకాయల ధర రూ.2 మాత్రమే పలకడంతో కోత కూలీ కూడా రావడంలేదని దొండరైతులు..
పశ్చిమ గోదావరి న్యూస్, జూలై 25: ఓ వైపు మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోతుంటే.. దొండకాయ ధరలు మాత్రం అమాంతం పడిపోయాయి. పశ్చిమగోదావరి ఖండవల్లి మార్కెట్లో కేజీ దొండకాయల ధర రూ.2 మాత్రమే పలకడంతో కోత కూలీ కూడా రావడంలేదని దొండరైతులు వాపోతున్నారు. దీంతో ఖండవల్లి నుంచి హైదరాబాద్, చెన్నై సహా పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని అధికారులను దొండ రైతులు అభ్యర్థిస్తున్నారు. ఇలా అయితే రానున్న కాలంలో దొండ పంటను పండించలేమని, కనీస మద్ధతు ధర ప్రకటించాలని విన్నపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..