Rishabh Pant: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పంత్ ఉండడం డౌటే.. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసిన టీమిండియా బౌలర్..
Rishabh Pant: రిషభ్ పంత్ గతేడాది జరిగిన కార్ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని బీసీసీఐ ప్రకటించడంతో భారత్ క్రికెట్ అభిమానులంతా సంబరపడిపోయారు. కానీ అంతలోనే పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో..
Rishabh Pant: రిషభ్ పంత్ గతేడాది జరిగిన కార్ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని బీసీసీఐ ప్రకటించడంతో భారత్ క్రికెట్ అభిమానులంతా సంబరపడిపోయారు. కానీ అంతలోనే పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కూడా కనిపించకపోవచ్చని టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. రిషభ్ పంత్ రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనే సభ్యుడైన ఇషాంత్ జియో సినిమాతో ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
‘రిషభ్ పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కనిపిస్తాడని నేను అనుకోవడంలేదు. అతనికి తగిలింది సాధారణమైన దెబ్బకాదు. పంత్ కేవలం బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ఆ తర్వాత పరుగులు తీయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ ఒక వికెట్ కీపర్, బ్యాటర్‌కి అది అంత సులువైన విషయం కాదు. అయితే పంత్ విషయంలో మంచి విషయమేమిటంటే.. అతను రెండో సర్జరీ చేయించుకోలేదు. మళ్లీ సర్జరీ జరిగినట్లయితే ఇంకొంత కాలం ఆటకు దూరంగా ఉండేవాడు. అతనికి ఇప్పుడు ఒక సర్జరీ జరిగింది కానీ వరల్డ్ కప్ సమయానికి అతను పూర్తి ఫిట్గా ఉంటాడని నేను అనుకోను. కానీ వచ్చే ఐపీఎల్ నాటికి పంత్ ఫిట్గా ఉండే బాగుంటుందని నేను ఆశిస్తున్నాన’ని ఇషాంత్ తెలిపాడు.
Rishabh Pant is making a strong return! pic.twitter.com/LTbWeVlQfU
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2023
కాగా, గతేడాది డిసెంబర్ 30న రిషభ్ పంత్‌కి ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై కారు ప్రమాదం జరిగింది. దీంతో అతను ఇప్పటికే ఒక సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా అతను ఐపీఎల్ 2023 సీజన్‌కి అందుబాటులో లేకపోవడంతో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించాడు. కానీ 16వ సీజన్‌లో పంత్ లేకపోవడంతో ఢిల్లీ ఘోరంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలో పంత్ వచ్చే సీజన్‌కి కూడా అందుబాటులోకి రాకుంటే.. 17వ ఐపీఎల్ ఎడిషన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కి కష్టాలు తప్పవు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..