AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వార్నీ.. ఇదేం బ్యాటింగ్ రా అయ్యా.. టెస్ట్‌లో టీ20 మ్యాచ్ చూపించావుగా.. దెబ్బకు ధోని రికార్డ్ ఫసక్..

IND vs WI: వెస్టిండీస్ పర్యటనలో భారత్ టెస్టు జట్టు (India Vs West Indies)లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కిషన్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో డొమినికాలో ఖాతా తెరవడానికి చాలా బంతులు తీసుకుని కెప్టెన్ ఆగ్రహానికి గురైన కిషన్.. రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో తుఫాన్ హాఫ్ సెంచరీతో టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు.

IND vs WI: వార్నీ.. ఇదేం బ్యాటింగ్ రా అయ్యా..  టెస్ట్‌లో టీ20 మ్యాచ్ చూపించావుగా.. దెబ్బకు ధోని రికార్డ్ ఫసక్..
Ishan Kishan (1)
Venkata Chari
|

Updated on: Jul 24, 2023 | 2:43 PM

Share

రిషబ్ పంత్ గైర్హాజరీతో భారత టెస్టు జట్టుకు తగిన వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కోసం వెతుకుతున్న సెలక్టర్లకు ఇషాన్ కిషన్ రూపంలో సరైన ఆటగాడు దొరికాడు. వెస్టిండీస్ పర్యటనలో భారత్ టెస్టు జట్టు (India Vs West Indies)లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కిషన్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో డొమినికాలో ఖాతా తెరవడానికి చాలా బంతులు తీసుకుని కెప్టెన్ ఆగ్రహానికి గురైన కిషన్.. రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో తుఫాన్ హాఫ్ సెంచరీతో టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు.

33 బంతుల్లో అరంగేట్రం టెస్టు హాఫ్ సెంచరీ..

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వర్షం కారణంగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఆ జట్టు తుఫాన్ బ్యాటింగ్. అంతకుముందు దీన్ని ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీతో మెరిపించగా, కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో తొలి టెస్టు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో రిషబ్ పంత్, వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్, హర్భజన్, ఎంఎస్ ధోనీ వంటి టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో కిషన్ చేరాడు.

33 బంతుల్లోనే అర్ధశతకం సాధించి 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కిషన్ బద్దలు కొట్టాడు. దీంతో ఈ రికార్డును లిఖించిన టీమిండియా రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. నరైన్ తమ్హానే, బుద్ధి కుందరన్, ఫరోఖ్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణి, నయన్ మోంగియా తర్వాత టెస్ట్ క్రికెట్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆరో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కూడా కిషన్ నిలిచాడు.

ఇవి కూడా చదవండి

నం. 4లో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్లు ఎవరు?

నరైన్ తమ్హానే vs ఆస్ట్రేలియా – చెన్నై, 1956

బుద్ధి కుందరన్ vs ఆస్ట్రేలియా – చెన్నై, 1960

ఫరోఖ్ ఇంజనీర్ vs ఇంగ్లాండ్ – లార్డ్స్, 1971

సయ్యద్ కిర్మాణి vs పాకిస్తాన్ – కరాచీ, 1978

సయ్యద్ కిర్మాణి vs పాకిస్థాన్ – బెంగళూరు, 1979

నయన్ మోంగియా vs ఆస్ట్రేలియా – ముంబై, 2001

ఇషాన్ కిషన్ vs వెస్టిండీస్ – పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2023

టెస్టుల్లో భారత వికెట్ కీపర్ చేసిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ..

28 బంతులు – రిషబ్ పంత్ vs శ్రీలంక, బెంగళూరు (2022)

33 బంతులు – ఇషాన్ కిషన్ vs వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (2023)

34 బంతులు – MS ధోని vs పాకిస్తాన్, ఫైసలాబాద్ (2006)

టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన వికెట్ కీపర్లు..

172.88 – 102*(59) – ఆడమ్ గిల్‌క్రిస్ట్ vs ఇంగ్లాండ్, పెర్త్ (2006/07)

161.29 – 50(31) – రిషబ్ పంత్ vs శ్రీలంక, బెంగళూరు (2022)

152.94 – 52*(34) – ఇషాన్ కిషన్ vs వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (2023)

145.23 – 61(42) – ఇయాన్ స్మిత్ vs పాకిస్తాన్, ఫైసలాబాద్ (1990)

145.23 – 61 (42) – మాట్ ప్రియర్ vs ఆస్ట్రేలియా, లార్డ్స్ (2009)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..