Janasena: పవన్ కీలక ప్రకటన.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ..
పవన్ తెలంగాణ ఎన్నికలకు సమాయమత్తమవుతున్నారు. వారాహి యాత్ర తెలంగాణలో కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు 26 నియోజకవర్గాలకు బాద్యులను ప్రకటించారు. ఆ డీటేల్స్ మీకోసం..
జనసేన అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ నేతలకు పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణలోనూ వారాహి యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. జనసేన సత్తా చూపించేలా 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. ఏ పార్టీలోనూ ఇంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వలేదని.. జనసేన ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పవన్ సూచించారు.
1.శ్రీ వేమూరి శంకర్ గౌడ్ – కూకట్ పల్లి
2.శ్రీ పొన్నూరు లక్ష్మి యి శిరీష – ఎల్బీనగర్
3.శ్రీ వంగ లక్ష్మణ గౌడ్ – నాగర్ కర్నూలు
4.శ్రీ తేజవత్ సంపత్ నాయక్ – వైరా
5.శ్రీ మిరియాల రామకృష్ణ – ఖమ్మం
6.శ్రీ గోకుల రవీందర్ రెడ్డి – మునుగోడు
7. శ్రీ నందగిరి సతీష్ కుమార్ – కుత్బుల్లాపూర్
8.డాక్టర్ మాధవరెడ్డి – శేరిలింగంపల్లి
9)శ్రీ ఎడమ రాజేష్ – పటాన్ చెరువు
10)శ్రీమతి మండపాక కావ్య -సనత్ నగర్
11)శ్రీ వై.ఎమ్.ఎన్.ఎస్.ఎస్.వి నిహారిక నాయుడు – ఉప్పల్, శివ కార్తీక్ కో కన్వీనర్ – ఉప్పల్
12)శ్రీ వేముల కార్తీక్ – కొత్తగూడెం
13)శ్రీ డేగల రామచంద్రరావు – అశ్వరావుపేట
14)శ్రీ శ్రీ వి.నగేష్ -పాలకుర్తి
15)శ్రీ మేరుగు శివకోటి యాదవ్ -నర్సంపేట
16)శ్రీ గాదె పృద్వి – స్టేషన్ ఘన్ పూర్
17)శ్రీ తగరపు శ్రీనివాస్ – హుస్నాబాద్
18)శ్రీ మూల హరీష్ గౌడ్ – రామగుండం
19)శ్రీ టెక్కల జనార్ధన్ – జగిత్యాల
20)శ్రీ చెరుకుపల్లి రామలింగయ్య -నకిరేకల్
21)శ్రీయన్ నాగేశ్వరరావు – హుజూర్ నగర్
22)శ్రీ మాయ రమేష్ – మంథని
23)శ్రీ మేకల సతీష్ రెడ్డి – కోదాడ
24)శ్రీ బండి నరేష్ – సత్తుపల్లి
25).శ్రీ వంశీకృష్ణ – వరంగల్ వెస్ట్
26)శ్రీ బాలు గౌడ్ – వరంగల్ ఈస్ట్
తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యం
* జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan సమావేశం
* 26 నియోజకవర్గాలకు బాధ్యుల నియామకం pic.twitter.com/NYgwDIvzSH
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
ఏపీలో ఇప్పటికే వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ప్రత్యేక పూజల తర్వాత.. ఈనెల 14న అన్నవరం దేవస్థానం నుంచి మొదలై.. భీమవరం వరకు తొలి విడత వారాహి యాత్ర సాగనుంది. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్రకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు
మరోవైపు ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ .. మంగళగిరి జనసేన కార్యాలయంలో యాగం చేపట్టారు. ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 6 గంటల 55 నిమిషాలకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు పవన్ కల్యాణ్. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ఉదయం ప్రారంభమైన యాగం మంగళవారం కూడా కొనసాగుతుంది.
కాగా ప్రముఖ నిర్మాత శ్రీ బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేనలో చేరారు. పవన్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు.#2DaysToVarahiYatra#JanaSena pic.twitter.com/cMGZVI3KkB
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.