AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధా, బాలయోగి తనయుడి భేటీ వెనక రీజన్ ఇదే

ప్రజంట్ ఏపీలో ఓ ఫోటో పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తుంది. అందులో వంగవీటి, పరిటాల వారసులు ఉన్నారు. బాలయోగి తనయుడు కూడా వారికి జత కూడారు.. ఇంతకీ ఎందుకో తెల్సా..?

Andhra Pradesh: పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధా, బాలయోగి తనయుడి భేటీ వెనక రీజన్ ఇదే
paritala sriram-Ganti Harish Madhur-Vanagveeti Radha
Ram Naramaneni
|

Updated on: Oct 17, 2022 | 3:17 PM

Share

పరిటాల.. వంగవీటి.. ఈ పేర్లలో వైబ్రేషన్ ఉంది. ఈ కుటుంబాలకు ఏపీ రాజకీయాల్లో ప్రత్యక గుర్తింపూ ఉంది. రంగా కానీ.. పరిటాల రవి కానీ విపరీతమైన మాస్ ఇమేజ్ ఉన్న నేతలు. ఇద్దరూ కూడా అకస్మాత్తుగా హత్యకు గురైన వారే. కాగా  ఒక తరం మారినా అభిమానం తగ్గలేదు. యువనేతలకు ఆ వారసత్వం కలిసొస్తోంది. తాజాగా రాజమండ్రిలో వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్‌ భేటీ అయ్యారు. ఇద్దరూ TDPలో కీరోల్‌ పోషిస్తున్నవాళ్లే. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నవాళ్లే. ఈ ఇద్దరి మీటింగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ ఫొటోల్ని శ్రీరామ్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

రాష్ట్రంలో బలమైన రాజకీయ నేపథ్యమున్న రెండు కుటుంబాలకు చెందిన వారసులు సమావేశం కావడంతో సహజంగానే అందరి దృష్టీ అటుపడింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. పరిటాల, వంగవీటి వారసులతోపాటు మీటింగ్‌లో గంటి మోహన చంద్ర బాలయోగి వారసుడు హరీష్‌ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఆయా సామాజికవర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్లు రావడంతో ఈ భేటీ వెనుక లెక్కేంటనే దానిపై చర్చ జరుగుతోంది. గతంలో విజయవాడలో వంగవీటి రాధాను కొందరు టార్గెట్ చేశారు. ఆయన ఆఫీసు, ఇంటి వద్ద రెక్కీ చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి సమయంలోనే రాధాపైనా ఎటాక్‌కి ప్లాన్ చేశారనే మాట వినిపించింది. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్‌ రాధాకు మద్దతుగా నిలబడ్డారు. రాధా తెలుగుదేశం కుటుంబ సభ్యుడని ఆయనకు తామంతా అండగా ఉంటామని అన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి స్నేహం బలపడింది. ఇప్పుడు రాజమండ్రి పర్యటన సందర్భంగా అది మరోసారి బయటపడింది.

వీరంతా కలిసింది అతడి కోసమే…

పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధా, గంటి హరీష్‌తోపాటు మరో వారసుడు కూడా వీరితో జతకలిసారు. జ్యోతుల నెహ్రూ వారసుడు నవీన్‌ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా నవీన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. మొత్తంగా యువనేతలంతా యాక్టివ్ కావడం టీడీపీలో జోష్‌ నింపుతోంది. సాధారణంగా టీడీపీ మహానాడులో ఇలాంటి దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం పలికేందుకు వచ్చిన నేతలంతా ఇలా సమావేశం అవ్వడం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించడం హాట్ టాపిక్ అయ్యింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..