Minister Roja: ప్రతి రోజు మెంటల్ టెన్షన్ పెడుతున్నారు.. వారిపై రగిలిపోయిన మంత్రి రోజా..
మంత్రిగా తనకు సమాచారం లేకుండా.. భూమి పూజ చేయడంపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే రాజకీయాలు చేయడం కష్టమంటూ అసమ్మతి నేతల తీరుపై మంత్రి రోజా ఆడియో విడుదల చేశారు.

నగిరి వైసీపీలో మరోసారి వర్గపోరు బయటపడింది. కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేశారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే రోజా లేకుండానే రైతు భరోసా కేంద్రానికి భూమిపూజ చేయడం రాజకీయ చర్చకు దారి తీసింది. నిండ్ర మండలం కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ కార్యక్రమాన్ని శ్రీశైలం బోర్డు చైర్మెన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి హాజరయ్యారు. ఇలాంటి సమయంలో మంత్రిగా ఉన్న తనను నియోజకవర్గంలో బలహీన పరిచే విధంగా కుట్ర చేస్తున్నారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు సమాచారం లేకుండా.. భూమి పూజ చేయడంపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే రాజకీయాలు చేయడం కష్టమంటూ అసమ్మతి నేతల తీరుపై మంత్రి రోజా ఆడియో విడుదల చేశారు.
తనకు సమాచారం ఇవ్వకుండా భూమి పూజ చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో తనను బలహీన పరిచే కుట్ర జరుగుతోందని ఈ ఆడియో మెసేజ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు నవ్వుకునే విధంగా.. వారికి సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. తనకు నష్టం జరిగే విధంగా.. పార్టీని దిగజారుస్తూ భూమి పూజ చేయడం ఎంత వరకు సమంజసం అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనపై పార్టీ పెద్దలు ఆలోచించాలి.. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే రాజకీయం చేయడం కష్టమన్నారు. తాము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. ప్రతి రోజూ మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. వీరు పార్టీ నాయకులు అని చెప్పి ప్రోత్సహించడం బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి రోజా విడుదల చేసిన ఆడియోను ఇక్కడ వినండి..
అయితే ఇలాంటి ఘటనలో నగరి నియోజకవర్గంలో బయట పడ్డాయి. ఈ ఏడాది ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఫ్లెక్సీల విషయంలో వివాదం జరిగింది. ఆ ఫ్లెక్సీల్లో రోజా ఫోటో లేకపోవడంతో స్థానికంగా ఆసక్తికర మంటల యుద్ధం జరిగింది. అలాగే ఇటీవల వైఎస్‌ఆర్ వర్థంతి కార్యక్రమాలు కూడా రోజా వ్యతిరేక వర్గం ఆరోపణలు చేసింది. ఇప్పుడు మంత్రికి సమాచారం ఇవ్వకుండా రైతు భరోసా కేంద్రానికి భూమిపూజ చేయడం చర్చనీయాంశమైంది.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం
