AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పాండవుల మెట్ట వద్ద పాలు పొంగిస్తుండగా ఆకాశంలో అద్భుత దృశ్యం

తూర్పుగోదావరి జిల్లా కాపవరం గ్రామంలో పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలాభిషేకం సందర్భంగా ఆకాశంలో వలయాకార మేఘాలు కనిపించాయి. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ ఘటనను గ్రామస్థులు శుభ సూచకంగా భావిస్తున్నారు .

Andhra: పాండవుల మెట్ట వద్ద పాలు పొంగిస్తుండగా ఆకాశంలో అద్భుత దృశ్యం
Sky Circle
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jul 07, 2025 | 1:32 PM

Share

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలాభిషేకం జరుగుతున్న వేళ… ఆకాశంలో ఏర్పడిన వలయాకార మేఘాలు స్థానికులను ఆశ్చర్యపర్చాయి. పాలాభిషేకం కోసం పాలు పొంగించే క్రమంలోనే ఆ దృశ్యం కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆకాశంలో ఏర్పడిన ఆ వలయం తేలికపాటి మేఘాలుగా ఉండటంతో… అక్కడున్న యువకులు మొబైల్ ఫోన్లలో దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆ దృశ్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది.

ప్రతి ఏడాది రైతులు పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలు పొంగించి.. పాడిపంటలు నైవేద్యంగా సమర్పించే ఆచారాన్ని పాటిస్తుంటారు. తమ ఇంటి పశువుల నుంచి తీసిన పాలు, నెయ్యితో స్వయంగా నైవేద్యాలు తయారు చేసి సమర్పించడం ఆనవాయితీ. ఈ సమయంలో ఇటువంటి దృశ్యం కనిపించడం తమ గ్రామానికి శుభ సూచకమని గ్రామస్థులు భావిస్తున్నారు. కాలక్రమంలో పంటలు బాగా పండాలని, వర్షాలు పడాలని భగవంతుడిని ప్రార్థిస్తూ రైతులు పాలాభిషేకం నిర్వహించారని తెలిపారు.

వీడియో దిగువన చూడండి….

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.