Andhra pradesh: తాను మరణిస్తూ మరో నలుగురిని బతికించిన పదో తరగతి చిన్నారి..

కన్న కొడుకు చనిపోయాడన్న పుట్టెదు దుఃఖం ఓవైపు వెంటాడుతోన్నా.. గారాబంగా పెంచుకున్న తమ పేగు బంధం చిన్న వయసులోనే తెగిపోయిందన్న బాధ గుండెల్ని పిండేస్తున్నా.. ఆ తల్లిదండ్రులు ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు...

Andhra pradesh: తాను మరణిస్తూ మరో నలుగురిని బతికించిన పదో తరగతి చిన్నారి..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 23, 2023 | 3:52 PM

కన్న కొడుకు చనిపోయాడన్న పుట్టెదు దుఃఖం ఓవైపు వెంటాడుతోన్నా.. గారాబంగా పెంచుకున్న తమ పేగు బంధం చిన్న వయసులోనే తెగిపోయిందన్న బాధ గుండెల్ని పిండేస్తున్నా.. ఆ తల్లిదండ్రులు ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ కొడుకు భౌతికంగా తమ నుంచి దూరమవుతున్నాడని తెలిసి, మరో నలుగురిని బతికించే మహోన్నత నిర్ణయం తీసుకుని పది మందికి ఆదర్శంగా నిలిచారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళలం జిల్లాకు చెంది కిరణ్‌ చంద్‌ అనే పదో తరగతి కుర్రాడు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బ్రెయిణ్‌ డెడ్‌కు గురయ్యాడు కిరణ్‌ చంద్‌. ఎంత చేసినా కిరణ్‌ను బతికిలంచలేమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో కిరణ్‌ పేరెంట్స్‌ గుండె పగిలినంత పనైంది. చిన్న వయసులో కన్న కొడుకు దూరమవుతున్నాడన్న బాధ వాళ్లను కుంగతీసింది.

అయితే తమ కొడుకు ఎలాగో బతకడు కనీసం మరో నలుగురిని బతికించే అవకాశాన్ని వదులుకొవద్దని నిర్ణయించుకున్నారు. గుండె నిండా విషాదంలోనూ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. కిరణ్‌ అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుల భాగంగానే జెమ్స్ ఆసుపత్రి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె, లివర్, కిడ్నీలను తరలించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి గుండె, విశాఖకు కిడ్నీ, లివర్ అవయవాలు తరలించారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి