- Telugu News Photo Gallery Telugu Weather update: Parts of Andhra Pradesh likely to receive heavy rains with lightning strike for three days
AP Weather: ఏపీలో వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. పిడుగులు కూడా.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ద్రోణి/గాలులు కోత ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వద్ద దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా కోన సాగుతున్నది. ఆంధ్రప్రదేశ్, యానం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ దక్షిణ / ఈశాన్య గాలులు వీస్తున్నాయి.
Updated on: Apr 23, 2023 | 3:34 PM

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం ప్రాంతాలలో నేడు( ఆదివారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉంది. వడగళ్లతో, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. సోమవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. మంగళవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో నేడు(ఆదివారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. సోమవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగంతో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. మంగళవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

రాయలసీమలో ఆదివారం, సోమవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగంతో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. మంగళవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

కాగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉందని.. పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద ఉండరాదని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ సూచించింది.

ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తలు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
