AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు.. పోలీసులు దర్యాప్తు చేయగా..

కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన ఒక బైక్ చోరీ కేసు విచారణలో పోలీసులు 35 చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దకడబూరు మండలానికి చెందిన మహేష్‌ను అరెస్టు చేయగా, వివిధ ప్రాంతాల్లో బైకులు చోరీ చేసి విక్రయించినట్లు విచారణలో అంగీకరించాడు.

Kurnool: బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు.. పోలీసులు దర్యాప్తు చేయగా..
Stolen Bikes
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jun 28, 2026 | 9:16 AM

Share

కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన ఒక బైక్ చోరీ కేసు విచారణలో పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. ఒక ద్విచక్ర వాహనం చోరీపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, చివరికి 35 బైకుల చోరీ వ్యవహారాన్ని ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి వివిధ ప్రాంతాల నుంచి చోరీకి గురైన 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదోనిలో ఓ వ్యక్తి తన బైక్‌ను పార్క్ చేసి తిరిగి వచ్చేసరికి అది కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న ఆదోని టూ టౌన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా పెద్దకడబూరు మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తిపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట ఒక బైక్ చోరీ కేసుపై ప్రశ్నించిన పోలీసులకు, విచారణలో మహేష్ సంచలన విషయాలు వెల్లడించాడు. తాను గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో బైకులు చోరీ చేస్తూ, మొత్తం 35 ద్విచక్ర వాహనాలను అపహరించినట్లు అంగీకరించాడు. అంతేకాకుండా ఏ ప్రాంతంలో ఏ బైక్ చోరీ చేశాడు, వాటిని ఎవరెవరికి విక్రయించాడు అనే వివరాలను కూడా పోలీసులకు వెల్లడించాడు.

నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టి, ఇప్పటికే విక్రయించిన దొంగ బైకులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఒకే కేసు విచారణలో భారీ సంఖ్యలో చోరీకి గురైన వాహనాలను పోలీసులు రికవరీ చేయగలిగారు. స్వాధీనం చేసుకున్న బైకుల వివరాలను పరిశీలిస్తున్నామని, వాటి యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇటీవల బైక్ చోరీకి గురైన వారు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలతో ఆదోని టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

బైక్ చోరీలను అలవాటుగా మార్చుకున్న మహేష్‌ను అరెస్టు చేసి, అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆదోని టూ టౌన్ పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Follow Us
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..