AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బైరెడ్డి వర్సెస్‌ ఒలంపిక్‌ అసోసియేషన్‌.. శాప్‌లో ముదిరిన వివాదం.. సీఎం జగన్‌ ముందుకు పంచాయితీ

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు శాప్‌ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా శాప్‌ ఛైర్మన్‌ భైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి , ఏపీ ఒలంపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కేపీ రావు ..

Andhra Pradesh: బైరెడ్డి వర్సెస్‌ ఒలంపిక్‌ అసోసియేషన్‌.. శాప్‌లో ముదిరిన వివాదం.. సీఎం జగన్‌ ముందుకు పంచాయితీ
Baireddy Siddardhareddy
Basha Shek
|

Updated on: Mar 24, 2023 | 11:41 AM

Share

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు శాప్‌ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా శాప్‌ ఛైర్మన్‌ భైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి , ఏపీ ఒలంపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కేపీ రావు మధ్య చెలరేగిన వివాదం శాప్‌ను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల వరుస వివాదాలతో సతమతమవుతున్న శాప్‌ను దారిలో పెట్టే ప్రయత్నం చేసే ఉద్దేశ్యంతో నిన్న విజయవాడలో అన్ని స్పోర్ట్స్‌ అసోసియేషన్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ల మధ్య వివాదాలు పరిష్కరించుకోవాలని , క్రీడాకారులను ఇబ్బందులు పెట్టవద్దని శాప్‌ ఛైర్మన్‌ భైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి సూచించారు. ఐతే సమావేశం మధ్యలో ఒలంపిక్‌ అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ వివాదాలు పెట్టుకోవడానికి మీటింగ్‌ పెట్టలేదని బైరెడ్డి అన్నారు. రాయలసీమ ఝులుం ఇక్కడ చూపించొద్దని కేపీ రావు అనడంతో, బైరెడ్డి అనుచరులు కేపీరావు షర్ట్‌ పట్టుకొని లాగారని ఆయన ఆరోపణలు చేశారు. మంత్రి రోజా వారించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే కేపీ రావు మాత్రం ఈ పంచాయతీని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా సీఎం జగన్‌ ప్రోత్సాహంతో క్రీడారంగంలో వేల సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే.. శాప్‌ నిర్వాకం వల్ల ఉన్న ఉద్యోగాలు పోయాయంటూ కేపీ రావు ఆరోపించారు.

కాగా ఏపీ శాప్‌లో ఇటీవల వివాదాలకు వేదికైంది. క్రీడా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు, లైగింక వేధింపులు వంటి అంశాల్లో శాప్‌ ప్రతిష్ట మసక బారుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శాప్‌ ఛైర్మన్‌, ఒలంపిక్‌ అసోసియేషన్ సభ్యుల మధ్య వివాదం శాప్‌ ప్రతిష్ఠను మరింత దిగజార్చింది. ఇక ఈవివాదంపై బైరెడ్డి స్పందించారు. తమను కొందరు కావాలనే రెచ్చగొట్టాలని చూశారన్నారు. ఏపీలో స్పోర్ట్స్‌ సర్వనాశనం కావడానికి.. కారకులు ఎవరో తమకు తెలుసన్నారు. విజయవాడ మీటింగ్‌లో గొడవ ఎవరు చేశారో తమ దగ్గర రికార్డు ఉందన్నారు. మొత్తానికి ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ. మరి సీఎం జగన్‌ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..