Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు.. చరిత్రలోనే తొలిసారిగా అంచనాలకు మించి..!!

TTD Temple: కలియుగ వైకుంఠం తిరుమలలో ఎటు చూసినా గోవింద నామ స్మరణే. ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పించుంటున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు.. చరిత్రలోనే తొలిసారిగా అంచనాలకు మించి..!!
Tirumala Tirupati Devasthanams
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 24, 2023 | 11:52 AM

ఏడుకొండలపై పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డ్‌ నెలకొంది. కలియుగ వైకుంఠం తిరుమలలో ఎటు చూసినా గోవింద నామ స్మరణే. ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పించుంటున్నారు. అలా.. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. దేశంలో ఏ దేవాలయంకు లేని విధంగా ఆదాయంలో ముందు నిలిచింది.

కోవిడ్ ఎన్నో వ్యవస్థలపైనా ప్రభావం చూపింది. మహమ్మారి అన్ని రంగాలను వెంటాడింది.. ఆర్థికంగా దెబ్బతీసింది. కొన్నింటిని నిర్వీర్యం చేసింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం కోవిడ్ ఆదాయాన్ని అనూహ్యంగా పెంచింది. పెరిగిన బ్యాంకు వడ్డీ రేట్లతో హుండీ ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. తగ్గు ముఖం పట్టాక మాత్రం గతంలో కంటే శ్రీవారి హుండీ ఆదాయాన్ని అనుహ్యంగా పెంచింది. కోవిడ్‌కు ముందు 1200 కోట్ల మేర హుండీ ఆదాయం టీటీడీకి వస్తుండగా.. ఇప్పుడు ఆ ఆదాయం 1500 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ క్రమంలోనే 4,411 కోట్ల రూపాయలతో టీటీడీ 2023-24 బడ్జెట్ అంచనాలకు టీటీడీ పాలక వర్గం ఆమోద ముద్ర వేసింది.

కోవిడ్ మహమ్మారి ప్రభావంపై ముందుగా అంచనా వేసిన టీటీడీ.. గతేడాది హుండీ ఆదాయం 1000 కోట్ల మేర ఉంటుందనుకుంది. అయితే అనుహ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,613 కోట్ల కానుకలు టీటీడీ ఖాతాకు చేరాయి. 2022 మార్చి నెల నుంచి ప్రతి రోజు శ్రీవారి హుండీ ఆదాయం 3 నుంచి 5 కోట్ల మేర ఉంటుండగా.. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గత జనవరి 2న రికార్డు స్థాయిలో ఒక్కరోజే 7.68 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. ఇలా అంతకంతకు పెరుగుతున్న ఉండి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం కూడా అదే రీతిలో ఉంటుందని అంచనా వేసిన టీటీడీ 1,591 కోట్ల మేర హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

ప్రతి ఏట తిరుమలకు వచ్చే భక్తులతో పాటు ఆదాయం కట్టలు గుట్టలుగా వస్తున్న సంపద వేలకోట్లలోకి చేరుకుంది. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్లు వడ్డీ రూపంలో అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి. 2023- 24 ఆర్థిక సంవత్సరం టీటీడీ బడ్జెట్ 4,411.68 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం ఆమోదముంద్ర వేసింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో హుండీ ఆదాయం 1591 కోట్ల మేర ఉంటుందన్న అంచనా వేసింది. పెట్టుబడుల వడ్డీ రూపంలో 990 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా 500 కోట్లు, దర్శన టికెట్ల విక్రయం ద్వారా మరో 330 కోట్లు, భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా 126.50కోట్లు, ఆర్జిత సేవల ద్వారా 140 కోట్లు, ఇక అద్దె గదులు, కళ్యాణమంటపాలా ద్వారా 129 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది టీటీడీ.

గతేడాది బ్యాంక్ డిపాజిట్ల పై వచ్చిన వడ్డీ ఆదాయం 668.51 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా వేసిన టీటీడీకి.. ఏకంగా పెరిగిన వడ్డీ రేట్లతో 813 కోట్ల రూపాయలు లభించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం 990కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా వేసిన టీటీడీకి కోవిడ్ కలిసి వచ్చిన అంశంగా మారిపోయింది. కోవిడ్ తర్వాత మొక్కులు తీర్చుకునే భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే కానుకల సంఖ్య పెరగడంతో వడ్డీ కాసుల వాడి ఆదాయం పెరిగిపోతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌