అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై స్పందించిన NHRC.. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడినవారు కేజీహెచ్‌, మెడికవర్‌, ఉషా ప్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 32 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై స్పందించిన NHRC.. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
Telugu News
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 23, 2024 | 6:28 PM

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడినవారు కేజీహెచ్‌, మెడికవర్‌, ఉషా ప్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 32 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది చనిపోగా… 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.

డీజీపీ, చీఫ్‌ సెక్రటరీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు అందించింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పాటు.. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపైనా ఆరా తీసింది ఎన్‌హెచ్‌ఆర్సీ. అంతకుముందు ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం రెడ్‌ బుక్‌పై పెట్టిన శ్రద్ధ.. వ్యవస్థల మీద పెట్టలేదని విమర్శించారు. ప్రభుత్వానికి సరైన దృష్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. రెండు వారాల్లో బాధితులకు పరిహారం అందించాలని.. లేదంటే ధర్నాకు దిగుతామని డెడ్‌లైన్‌ విధించారు జగన్‌.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్